Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అన్నదాతలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర విమర్శలు

అన్నదాతలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం: మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర విమర్శలు

వార్త 2 weeks ago

Mahabubnagar News: రైతుల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్యం..

  • మూడు విడుతల రైతుబంధు ఎగ్గొట్టారు..
  • కరెంటు లేదు..ఎరువులు లేవు..
  • పంటలను కూడా కొనలేని దుస్థితి..
  • గతంలో 72,000 కోట్లతో 11 విడుదల రైతుబంధు..
  • డ్రామాలు సంబరాలు చేయలే..
  • నేరుగా రైతుల ఖాతాల్లో జమచేసాం..
  • చెరువులను బాగు చేసి ఆయకట్టుకు సాగునీరందించాం..
  • ప్రీమియం చెల్లించక రైతు బీమా బంద్ చేశారు..
  • మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బి.ఆర్.ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, కనీస ప్రణాళిక లేకపోవడంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల లోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి అన్నదాతలను కడుపులో పెట్టుకొని చూసుకుందామని చెప్పారు. రైతును రాజు చేసే దిశగా కెసిఆర్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేసిందన్నారు వర్షాకాలానికి ముందే చెరువులను కుంటలను మిషన్ కాకతీయ పేరుతో బాగుచేసి రాష్ట్రంలో 45 వేల చెరువులకు పునర్జీవం అందించమన్నారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు, 9:30 ఏళ్లలో 72 వేల కోట్లతో 11 విడుతలుగా రైతుబంధు సాయం అందించామన్నారు. కరోనా లాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా రైతుబంధు రైతు బీమా పథకాలు ఆపలేదన్నారు. అనుకోని ప్రమాదం జరిగి కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోతే ఒక గుంట పొలం ఉన్న రైతుకు కూడా రూ. 5 లక్షల బీమా అందించామని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా అడ్డంకులే..
    కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ రెండున్నర ఏళ్లలోనే రైతులను నాన్న ఇబ్బందులకు గురి చేస్తుందని లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎరువులు కూడా సరైన సమయానికి అందించలేని దుస్థితి ఏర్పడిందని, మూడు విడతలు రైతుబంధు ఎగ్గొట్టి అన్నదాతలను అవస్థలకు గురిచేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేవలం ఒక్కసారి మాత్రమే పూర్తిస్థాయిలో రైతుబంధు నిధులు విడుదల చేసి దానికి మళ్లీ పెద్ద ఎత్తున సంబరాలు చేయడం ఏంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కనీసం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదని ఇలాంటి హంగు ఆర్భాటం ప్రచారం లేకుండానే నేరుగా రైతు ఖాతాల్లో నిధులు జమ అయ్యాయని చెప్పారు. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ఏర్పాటు చేయడంతో, వర్షాలు పడి రైతులు పంట నష్టపోయారని, గన్నీ బ్యాగులు లేక కేంద్ర ప్రభుత్వాన్ని సాకుగా చూపిస్తూ ధాన్యాన్ని సమయానికి కొనక రైతులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. వానాకాలం ప్రారంభం అయినా ఇప్పటికీ ఎరువులు కూడా అందుబాటులో లేవని మళ్లీ రైతులు ధర్నాలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడాలని, ఎరువులను విత్తనాలను అందుబాటులో ఉంచి సరైన సమయానికి పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లో స్పందించాలి.. కవిత హెచ్చరిక

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha