Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లో స్పందించాలి.. కవిత హెచ్చరిక

కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల్లో స్పందించాలి.. కవిత హెచ్చరిక

వార్త 2 weeks ago

Kavitha Singareni protest: సింగరేణి బొగ్గు గని కార్మికుల సమస్యల సాధన కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమయ్యారు.

'బాయిబాట' కార్యక్రమంలో భాగంగా ఆమె జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే-5 గనిని సందర్శించి కార్మికులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యం, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

సింగరేణిలో మెడికల్ అన్‌ఫిట్ (వైద్యపరంగా అన్‌ఫిట్) కోసం దరఖాస్తు చేసుకుని, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న దాదాపు 1200 మంది కార్మికుల వారసులకు తక్షణమే డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. “ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి ప్రభుత్వానికి నెల రోజుల సమయం ఇస్తున్నాం. ఆలోగా వారసులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే, జులై 20 నుంచి నేను సింగరేణి కార్మికుల కోసం నిరాహార దీక్షకు కూర్చుంటాను” అని కవిత సంచలన ప్రకటన చేశారు.

Read Also : Moinabad Farmhouse Snake Bite:చిన్న పామే కదా అని నిర్లక్ష్యం.. ఫాంహౌస్‌లో స్నేహితులతో సాహసం

 Congress government must respond within a month: Kavitha’s warning.

Kavitha Singareni protest: డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచే లంచాలు: కవిత ఆరోపణ

కాంగ్రెస్ పాలనపై కల్వకుంట్ల కవిత తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. సింగరేణిలో ఏ చిన్న పని జరగాలన్నా నేరుగా డిప్యూటీ సీఎం ఆఫీస్ నుంచే లంచాలు అడుగుతున్నారంటూ ఆమె మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో లాభాల్లో నడిచిన సింగరేణిని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తమ కక్కుర్తితో నష్టాల్లోకి నెట్టేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గనుల లోపల పనిచేసే కార్మికులకు కనీసం స్వచ్ఛమైన గాలి, తాగడానికి మంచి నీరు కూడా ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ధ్వజమెత్తారు.

ఇటీవల సింగరేణి గనిలో జరిగిన ప్రమాదంపై కవిత స్పందిస్తూ, ఒక కార్మికుడికి తీవ్ర గాయాలవడానికి యాజమాన్యం వాడుతున్న నాసిరకం డిటోనేటర్లే కారణమని ఆరోపించారు. కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడటం ఆపాలని హితవు పలికారు. అలాగే, విజిలెన్స్ ఎంక్వయిరీల పేరుతో కార్మికులను భయభ్రాంతులకు గురిచేసే ధోరణిని యాజమాన్యం మానుకోవాలని స్పష్టం చేశారు.

'హౌసింగ్ బోర్డు' ఏర్పాటు చేయాలి

రిటైర్ అయిన బొగ్గుగని కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం సింగరేణి సంస్థకు ప్రత్యేకంగా 'హౌసింగ్ బోర్డు' ఏర్పాటు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కార్మికులు ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం లేదా కార్మిక సంఘం తరఫున రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని కోరారు. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలం నుంచే తాను సింగరేణి కార్మికులతో కలిసి నడిచానని కవిత గుర్తుచేశారు. తెలంగాణ హక్కుల రక్షణ కోసం తాను కొత్తగా స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' పార్టీని భూపాలపల్లి ప్రజలు, బొగ్గుగని కార్మికులు తమ గుండెల్లో పెట్టుకుని ఆదరించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జూన్ 23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha