Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు: 10 మంది అరెస్ట్

అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు: 10 మంది అరెస్ట్

వార్త 1 month ago

Anantapur crime: అంతర్జాతీయ క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆటను పోలీసులు కట్టించారు. బెట్టింగ్ కు పాల్పడుతున్న 10 మంది ముఠాను అరెస్టు చేసి వారి నుండి రూ.

19,70,500లు, కారు, 4 ద్విచక్రవాహనాలు, 3 ల్యాబ్ ట్యాబ్ లను స్వాధీన పరుచుకున్నారు. వివరాలను జిల్లా ఎస్పీ జగదీష్ మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

Read also: USA Crime News : టెక్సాస్ కాల్పులు ఇద్దరి మృతి అసలు కారణం ఏంటి?

 Police arresting betting gang members

Anantapur crime: అరెస్ట్ అయిన నిందితుల వివరాలు

అరెస్ట్ అయిన వారిలో తలారి మధు (33), సిద్దప్పవంక వీధి, కళ్యాణదుర్గం పట్టణం; వేపరాళ్ల మహమ్మద్ మోల (25), కుమ్మర వీధి, కళ్యాణదుర్గం పట్టణం; షేక్ బాబ్జాన్ (32), ఎర్రనేల వీధి, కళ్యాణదుర్గం పట్టణం; షేక్ రోషన్ వలి (31), ఇందిరమ్మ కాలనీ, కళ్యాణదుర్గం పట్టణం; మాకోడికి శ్రీనివాసులు (47), ఎర్రనేల వీధి, కళ్యాణదుర్గం పట్టణం; తిమ్మయ్య (45), జెల్లిపల్లి గ్రామం, కంబదూరు మండలం; రాగవెంకట పవన్ కుమార్ (25), శ్రీనివాసపురం గ్రామం, జంగారెడ్డి గూడెం మండలం, ఏలూరు జిల్లా; సుంకరవైన కిరణ్ (32), పిల్లలమర్రి గ్రామం, సూర్యపేట జిల్లా (ప్రస్తుత నివాసం వనస్థలిపురం, రంగారెడ్డి జిల్లా); రాపాక ప్రశాంత్ (33), కోటిలింగాల గ్రామం, వెలగటూరు మండలం, జగిత్యాల జిల్లా; గడ్డవలస మణికంఠ రాజ (28), అజిత్ సింగ్ నగర్, విజయవాడ ఉన్నారు. పరారీలో ఉన్న నిందితులుగా కర్నాటకకు చెందిన సచిన్, ఫిలిప్పీన్స్ కు చెందిన శివను గుర్తించారు.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

పోలీసులు నిందితుల నుండి నగదు రూ. 19,70,500/-, ఒక కారు, 4 బైకులు, 03 ల్యాప్ ట్యాప్ లు, 01 ట్యాబ్, 15 మొబైల్ ఫోన్స్, 1 పవర్ బ్యాంక్, 15 సిమ్ కార్డులు, 13 ఎటిఎం కార్డులు, 04 చెక్ బుక్ లు, 01 ఖాళీ బ్యాంకు పాస్ బుక్కు, 06 స్కానర్లు, 01 డ్రీమ్ ప్లే 1 బ్లూటూత్, 03 పెన్ డ్రైవులు, 02 కార్డ్ రీడర్స్, 100 డ్రీమ్ ప్లే 1 పబ్లిసిటి కార్డ్స్, 03 కార్గో జీన్స్ ప్యాంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 9 బ్యాంకుల్లోని రూ. 18.20 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు.

ఫిలిప్పీన్స్ కేంద్రంగా ఆపరేషన్

ప్రస్తుతం అరెస్టయిన ఈ 10 మంది సభ్యులు కూడా ఫిలిప్పీన్స్ కేంద్రంగా అంతర్జాతీయ నిషేధిత ఆన్లైన్ గేమింగ్ నిర్వహిస్తున్న శివ ముఠాకు చెందిన వారు. వీరి ద్వారా మూల్ అక్కౌంట్లు, వారి పాస్ బుక్కులు, సిమ్ కార్డులను సేకరించి ఢిల్లీ కేంద్రంగా పని చేయు తన ముఠాలోని సభ్యుల ద్వారా సదరు సిమ్ కార్డులను ఫిలిప్పీన్స్ దేశానికి కార్గో జీన్స్ పాంట్ల ద్వారా తెప్పించుకుంటాడు. ఫిలిప్పీన్స్ లోని మాకాటి మెట్రో మనిలా అను ప్రదేశాన్ని కేంద్రంగా చేసుకొని నిషేధిత డ్రీమ్ ప్లే 1 యాప్ ద్వారా మూడు సంవత్సరాల నుండి ఆన్లైన్లో క్యాషినో, రోలెంట్, డ్రాగన్, మోనోపోలో, క్రికెట్ బెట్టింగ్, ఇతర నిషేధిత గేములను ఆడిస్తూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు.

నేరగాళ్ల నెట్ వర్క్

క్రికెట్ బెట్టింగ్ లావాదేవీలు అన్నీ దాదాపుగా ఫోన్ పే ద్వారా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇన్స్టాగ్రాం ద్వారా శివకు, తలారి మధుకు మూడేళ్ల కిందట పరిచయం ఏర్పడింది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహణకు సహకరిస్తే తనకు వచ్చే అమోంటులో 60 శాతం తను తీసుకుని, మిగితా 40 శాతం ఏజంట్లుగా ఉంటే మీ ఖాతాల్లో వేస్తానని శివ చెప్పడంతో మధు అంగీకరించాడు. దీంతో తలారి మధు స్థానికంగా ఉన్న వేపరాళ్ల మహమ్మద్, షేక్ బాబ్జాన్, షేక్ రోషన్ వలీ, మాకొడికి శ్రీనివాసులు, తిమ్మయ్యలను సిద్ధం చేసుకున్నాడు. పవన్ కుమార్, కిరణ్, ప్రశాంత్, మణికంఠరాజలను జత చేసుకుని వీరంతా కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరందరు కూడా సులువుగా డబ్బు సంపాదించాలని భావించి నిషేధిత ఆన్లైన్ డ్రీమ్ ప్లే 1 యాప్ ద్వారా గేమింగ్ కు పాల్పడుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

స్మృతి మంధాన స్నేహితుడి ఫిర్యాదుతో కేసు నమోదు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha