Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనుమానంతో ఘాతుకం.. భార్యను చంపిన భర్త!

అనుమానంతో ఘాతుకం.. భార్యను చంపిన భర్త!

వార్త 1 month ago

Meerpet Murder Case: హైదరాబాద్‌లోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఘోర హత్య కలకలం రేపింది. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త, అత్యంత కిరాతకంగా ఆమెను కత్తితో నరికి చంపాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం శివన్నగూడెం గ్రామానికి చెందిన నరసింహ (60), తన భార్య వసంతతో కలిసి బీఎన్ రెడ్డి నగర్ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివసిస్తున్నాడు.

Read Also : Anakapalli Road Accident: లారీ ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం

 Meerpet Murder Case: Suspicion led to murder.. Husband killed his wife!

నిద్రలోనే దాడి.. అక్కడికక్కడే మృతి

గత కొంతకాలంగా భార్యకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో నరసింహ ఆమెతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున నిద్రిస్తున్న వసంతపై నరసింహ కత్తితో మెడపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో వసంత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

కేసు నమోదు చేసిన పోలీసులు

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న మీర్‌పేట్ పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు నరసింహను అదుపులోకి తీసుకుని, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పైలట్ రోహిత్ రెడ్డికి బెయిల్.. హైకోర్టు పెట్టిన షరతులు ఇవే!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha