Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లారీ ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం

లారీ ఢీకొని ఇద్దరు యువకులు దుర్మరణం

వార్త 1 month ago

Anakapalli Road Accident: అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సరదాగా విహారయాత్ర కోసం బైక్‌పై బయలుదేరిన ఇద్దరు యువకులను మృత్యువు లారీ రూపంలో కబళించింది.

అగనంపూడి ప్రాంతానికి చెందిన అఖిల్ (25), అజయ్ (20) అనే ఇద్దరు యువకులు బైక్‌పై యానాం వెళ్తుండగా, కశింకోట మండలం బయ్యవరం సమీపంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.

Read Also : Patiala in Punjab: రైల్వే ట్రాక్‌పై బాంబు పెట్టడానికి ప్రయత్నించిన వ్యక్తి ..పేలుడుతో మృతి

 Anakapalli Road Accident Two Dead

Anakapalli Road Accident: మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచిన యువకులు

బయ్యవరం వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా వచ్చిన లారీ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడి రక్తపు మడుగులో పడిపోయారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, గాయాలు బలంగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లే మార్గమధ్యలోనే అఖిల్, అజయ్ మృతి చెందారు.

కుటుంబాల్లో విషాద ఛాయలు

సరదాగా గడపడానికి వెళ్లిన యువకులు శవాలై రావడంతో అగనంపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు, లారీ డ్రైవర్ నిర్లక్ష్యంపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఎసిబి వలలో బాపట్ల మునిసిపల్ ఆర్ఐ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha