Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అనుమతులు లేకుండానే నిర్మాణాలు.. ఐలాపూర్ వివాదంపై హైడ్రా స్పష్టత

అనుమతులు లేకుండానే నిర్మాణాలు.. ఐలాపూర్ వివాదంపై హైడ్రా స్పష్టత

వార్త 2 months ago

అద్దెకున్న వారిని ఖాళీ చేయించాకే కూల్చివేతలు

అమీన్పూర్ మండలం ఐలాపూర్ వివాదంపై హైడ్రా వివరణ

Ailapur Demolitions: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో న్యాయవాది ఎం.ఎ.

ముఖీం సాగిస్తున్న ఆక్రమణకు చెక్పెట్టినట్లు హైడ్రా తెలిపింది. గతవారం రోజులుగా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో జరుగుతున్న కూల్చివేతల వివాదం, దుష్ప్రచారంపై మంగళవారం వివరణ ఇచ్చింది. అమీన్పూర్ మండలం ఐలాపూర్ విలేజ్లోని ప్రభుత్వ భూమిలో ముఖీం సోదరుడు అజీం అపార్టుమెంట్లు కట్టి హైడ్రా వచ్చేసరికే అమ్ముకున్నాడని.. ఇప్పటికే 4 అపార్టుమెంట్లు నిర్మించి ప్రజలకు అమ్మేయగా.. హైడ్రా వచ్చాక 6 అంతస్తుల భవన నిర్మాణ దశలోనే హెచ్చరించిందని తెలిపింది.

ఈ భవనానికి ఎలాంటి అనుమతులు లేవని 2025వ సంవత్సరం జూన్ నెల 25వ షోకాజ్ నోటీసు ఇచ్చామని అయితే ఈ షోకాజ్ నోటీసుకు గతంలో గ్రామపంచాయతీ అనుమతులు ఇచ్చిందని.. కిష్టారెడ్డి పేటలో తన భవనం వస్తుందని అజీం వివరణ ఇచ్చాడని కానీ ఎక్కడా నిర్మాణ అనుమతులను హైడ్రాకు ప్రొడ్యూస్ చేయలేదని తెలిపారు.

Read Also: TG Inter Results: ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కాలేజీ అమ్మాయిలు..సీఎం అభినందనలు

 hydra clarification ailapur aminpur demolitions encroachments

Ailapur Demolitions: ఆక్రమణల వివాదంపై హైడ్రా వివరణ.

పంచాయతీ అనుమతులున్నాయని చెప్పడంతో వాటిపై విచారించగా.. పంచాయతీతో పాటు తర్వాత మున్సిపాలిటీలోనూ ఎలాంటి అనుమతులు తీసుకున్నట్టు ఆధారాలు లేవని హైడ్రా నిర్ధారించిందని దీంతో 2025 జులై 3వ తేదీన స్పీకింగ్ ఆర్డర్ను జారీ చేసి..15 రోజుల గడువు కూడా ఇచ్చినట్లు హైడ్రా ఇచ్చినట్లు తెలిపారు. అయితే భవన నిర్మాణాన్ని ముఖీం సోదరుడు అజీం పూర్తి చేయగా హైడ్రా నోటీసుల దృష్ట్యా ఆ భవనంలోని 45 ఫ్లాట్లలో ఏ ఒక్కటినీ కొనడానికి వినియోగదారులు ముందుకు రాలేదని దీంతో వాటిని తన అనుచరులతో పాటు.. ఈ విషయాలు ఏవీ తెలియని అమాయకులతో 20 ప్లాట్ల వరకూ నింపాడని పేర్కొన్నారు. గతంలో అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో కట్టిన 4 అపార్టుమెంట్లలో కొన్నవారు నష్టపోకూడదని సైలెంట్గా ఉన్న హైడ్రా.. షోకాజ్ నోటీసులు, స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చిన భవనం విషయంలో చర్యలకు సిద్ధమై అద్దెకు ఉన్న వారిని ఖాళీ చేయాలని స్పష్టంగా సూచిస్తూ భవన యజమానికి నోటీసులు ఇచ్చిందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్ లో లండన్ వర్సిటీ క్యాంపస్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha