Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కాలేజీ అమ్మాయిలు..సీఎం అభినందనలు

ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కాలేజీ అమ్మాయిలు..సీఎం అభినందనలు

వార్త 2 months ago

TG Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఇటీవల విడుదల చేసిన వార్షిక పరీక్షా ఫలితాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ మహిళా జూనియర్ కాలేజీ విద్యార్థినులు అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో సత్తా చాటారు.

ఈ ఫలితాల్లో ఇంటర్ ఫస్టియర్‌లో 66.20 శాతం మంది విద్యార్థులు పాస్ అవగా.. సెకండియర్‌లో 70.58 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో అమ్మాయిలే పైచేయి సాధించి ఔరా అనిపించారు. ఇక ఈ ఫలితాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఎన్టీఆర్ మహిళా జూనియర్ కాలేజీ అమ్మాయిలు సత్తా చాటారు.

Read Also:Hyderabad ORR Road Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం… తండ్రి, కొడుకు మృతి

TG Inter Results: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు

తెలంగాణ రాష్ట్ర బోర్డ్ ఆఫ్ ఇంటర్మీయేట్ ఎడ్యుకేషన్ నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎన్టీఆర్ మహిళా జూనియర్, డిగ్రీ కాలేజ్ విద్యార్ధులకు నా అభినందనలు. అన్ని విభాగాల నుంచి పదుల సంఖ్యలో విద్యార్ధులు అత్యధిక మార్కులు, టాప్ ర్యాంకులతో ప్రతిభ కనబరచడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. సీనియర్ ఎంపీసీ నుంచి 2, 3 రాష్ట్ర ర్యాంకులతో పాటు జూనియర్ ఎంపీసీలో 10 మంది విద్యార్ధులు, జూనియర్ బైపీసీలో 11 మంది విద్యార్ధులకు ఉత్తమ ర్యాంకులు వచ్చాయి.

అలాగే జూనియర్ ఎంఈసీలో 3, 4 ర్యాంకులు, జూనియర్ సీఈసీలో 5వ ర్యాంకు ఎన్టీఆర్ మహిళా జూనియర్, డిగ్రీ కాలేజ్ విద్యార్ధులకు రావడం గర్వకారణం. ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న అత్యున్నత సేవలకు దక్కిన ఫలితం ఇది. దీనికి కారణమైన ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులకు, కళాశాల బోధనా సిబ్బందికి, ఉద్యోగులకు మనస్ఫూర్తిగా అభినందనలు… ఇదే ఉత్సాహం, ఇదే సేవా స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాను అని ట్వీట్ చేసారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నారా లోకేష్‌కు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha