Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అణ్వాయుధాలు వదులుకుంటేనే ఇరాన్‌తో ఒప్పందం: ట్రంప్

అణ్వాయుధాలు వదులుకుంటేనే ఇరాన్‌తో ఒప్పందం: ట్రంప్

వార్త 3 weeks ago

రాన్‌పై విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. ఇరాన్ తన అణు లక్ష్యాలను పూర్తిగా విడనాడితేనే చర్చలు సఫలమవుతాయని ఆయన స్పష్టం చేశారు.

ఇరాన్ ఓడరేవులను ముట్టడించడం అనేది అమెరికా సైనిక పటిమకు నిదర్శనమని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా నేవీ సామర్థ్యం ముందు ఇరాన్ నిలబడలేదని, వారి వైమానిక నౌకాదళ శక్తులు దాదాపు నిర్వీర్యమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ దిగ్బంధనం వల్ల ఇరాన్ ఆర్థికంగా చితికిపోయిందని, ఇది తమ దౌత్య వ్యూహంలో భాగమని ట్రంప్ వివరించారు. కేవలం ఫోన్ ద్వారానే చర్చలు సాగుతున్నాయని, ఇరాన్ అణ్వాయుధాల విషయంలో వెనక్కి తగ్గితేనే తుది ఒప్పందం కుదురుతుందని చెప్పారు.

Read Also: Russiah-India: త్వరలో రష్యా నుంచి భారత్ నాలుగో ఎస్-400 క్షిపణి వ్యవస్థను అందుకోనున్నది!

 Iran-America War

Iran-America War: ఒపెక్ (OPEC) నుండి యూఏఈ నిష్క్రమణపై హర్షం

పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (OPEC) నుండి యూఏఈ (UAE) బయటకు రావడాన్ని ట్రంప్ స్వాగతించారు. యూఏఈ స్వతంత్రంగా చమురు ఉత్పత్తిని పెంచుకోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది అత్యంత తెలివైన నిర్ణయమని, దీనివల్ల ప్రపంచ వినియోగదారులకు మేలు జరుగుతుందని ట్రంప్ కొనియాడారు. ఉక్రెయిన్ మరియు ఇరాన్ వివాదాల్లో నాటో మిత్రదేశాల తీరుపై ట్రంప్ విమర్శలు గుప్పించారు. అమెరికా ఆశించిన స్థాయిలో ఐరోపా దేశాలు మద్దతు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఇరాన్ విషయంలో నాటో దేశాలు అసలు బాధ్యత తీసుకోవడం లేదని, ఇది అమెరికాపై భారాన్ని పెంచుతోందని అసహనం వ్యక్తం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha