Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
స్టేట్ డిన్నర్‌లో చమత్కారం: ట్రంప్‌కు రాజు ఛార్లెస్ చారిత్రక కౌంటర్

స్టేట్ డిన్నర్‌లో చమత్కారం: ట్రంప్‌కు రాజు ఛార్లెస్ చారిత్రక కౌంటర్

వార్త 1 month ago

మెరికా పర్యటనలో ఉన్న డొనాల్డ్ ట్రంప్‌కు బ్రిటన్ రాజు ఛార్లెస్-3 తనదైన శైలిలో ఇచ్చిన సమాధానం ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇది కేవలం సరదా సంభాషణ మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ చరిత్రకు అద్దం పట్టింది. గతంలో ట్రంప్ చేసిన ఒక వ్యాఖ్యను రాజు ఛార్లెస్ ఈ వేదికపై గుర్తు చేశారు. “రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా సాయం చేయకపోతే ఐరోపా దేశాలు జర్మన్ మాట్లాడాల్సి వచ్చేది” అని ట్రంప్ గతంలో అన్నారు. దీనికి కౌంటర్‌గా రాజు ఛార్లెస్ మాట్లాడుతూ.. “బ్రిటిష్ వారు గనుక లేకపోయి ఉంటే, మీరు (అమెరికన్లు) ఇప్పుడు ఇంగ్లీష్‌కి బదులుగా ఫ్రెంచ్ మాట్లాడాల్సి వచ్చేది” అని వ్యాఖ్యానించారు.

Read Also: Trump Photo: అమెరికా 250 ఏళ్ల వేడుకలు: ట్రంప్ ఫొటోతో ప్రత్యేక పాస్‌పోర్ట్‌

 King Charles

King Charles: చారిత్రక నేపథ్యం: ఫ్రెంచ్ అండ్ ఇండియన్ వార్

రాజు ఛార్లెస్ వ్యాఖ్యల వెనుక 250 ఏళ్ల నాటి చరిత్ర ఉంది. 18వ శతాబ్దంలో అమెరికా భూభాగంపై ఆధిపత్యం కోసం బ్రిటన్ మరియు ఫ్రాన్స్ మధ్య ‘సెవెన్ ఇయర్స్ వార్’ (1756-1763) జరిగింది. ఈ యుద్ధంలో బ్రిటన్ గెలవడం వల్ల అమెరికాలో ఇంగ్లీష్ ప్రధాన భాషగా మారింది. ఒకవేళ ఆనాడు ఫ్రాన్స్ గెలిచి ఉంటే, నేడు అమెరికా సంస్కృతి, భాష పూర్తిగా ఫ్రెంచ్ ప్రభావంతో ఉండేవి. దీనినే రాజు ఛార్లెస్ పరోక్షంగా ప్రస్తావించారు. విందులో కేవలం హాస్యం మాత్రమే కాకుండా, రాజకీయ ఉద్రిక్తతలు కూడా కనిపించాయి. ముఖ్యంగా ఇరాన్ విషయంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అనుసరిస్తున్న తీరుపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికాకు పూర్తిస్థాయిలో మద్దతు ఇవ్వడంలో స్టార్మర్ వెనుకడుగు వేస్తున్నారని, ఇది మిత్రధర్మం కాదని ట్రంప్ పరోక్షంగా విమర్శించారు. ఈ స్టేట్ డిన్నర్ అమెరికా-బ్రిటన్ దేశాల మధ్య ఉన్న అచంచలమైన చారిత్రక అనుబంధాన్ని గుర్తు చేయడమే కాకుండా, వర్తమాన రాజకీయాల్లో ఉన్న భేదాభిప్రాయాలను కూడా బయటపెట్టింది. రాజు ఛార్లెస్ చమత్కారాన్ని ట్రంప్ అభినందించినప్పటికీ, విధానపరమైన అంశాల్లో మాత్రం పట్టువిడవలేదు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

త్వరలో రష్యా నుంచి భారత్ నాలుగో ఎస్-400 క్షిపణి వ్యవస్థను అందుకోనున్నది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha