Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP Budget 2026-27: రూ.3.5 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్!

AP Budget 2026-27: రూ.3.5 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్!

వార్త 4 months ago

AP Budget 2026-27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని ప్రతిబింబించే 2026-27 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది.

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా రూపొందించిన ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బడ్జెట్ ప్రవేశపెట్టే సమయం

శనివారం ఉదయం 11:15 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో శాసనమండలిలో మరో మంత్రి బడ్జెట్ ప్రతిపాదనలను ఉంచుతారు.

AP Budget 2026-27: రూ. 3.50 లక్షల కోట్ల భారీ అంచనా

ఈ ఏడాది బడ్జెట్ పరిమాణం గతంతో పోలిస్తే భారీగా ఉండనుంది. దాదాపు రూ. 3.45 లక్షల కోట్ల నుండి రూ. 3.50 లక్షల కోట్ల వరకు బడ్జెట్ కేటాయింపులు ఉండవచ్చని ప్రాథమిక అంచనా. సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన మరియు సూపర్ సిక్స్ హామీలకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది.

కేబినెట్ ఆమోదముద్ర

బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చించి, మంత్రివర్గం అధికారికంగా ఆమోదముద్ర వేయనుంది. అనంతరం మంత్రులు బడ్జెట్ ప్రతులతో అసెంబ్లీకి చేరుకుంటారు.

Read hindi news: hindi.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha