Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Pawan Kalyan: ఇక శ్రీకాళహస్తిలోను గిరి ప్రదక్షిణ.!

Pawan Kalyan: ఇక శ్రీకాళహస్తిలోను గిరి ప్రదక్షిణ.!

వార్త 4 months ago

హా శివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భక్తులకు ఆనందవార్త అందించారు. ఆలయాల్లో పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే అపచారాలు జరగవని ఆయన స్పష్టం చేశారు.

గతంలో నిర్లక్ష్యం వల్ల కొన్ని ఘటనలు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఇకపై అలాంటి తప్పులు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తుల విశ్వాసం కాపాడటం పాలక మండళ్ల ప్రధాన బాధ్యత అని ఆయన అన్నారు.

Read also: Nara Lokesh: ట్రిపుల్ ఐటీల్లో శాశ్వత సౌకర్యాలు కల్పిస్తాం

Giri Pradakshina in Srikalahasti!

శ్రీకాళహస్తిలో ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ

తమిళనాడులోని అరుణాచలం తరహాలోనే శ్రీకాళహస్తి ఆలయంలో ప్రతి పౌర్ణమికీ గిరి ప్రదక్షిణ నిర్వహించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. గిరి ప్రదక్షిణ మార్గంలో రూ.10 కోట్లతో సిమెంట్ రహదారి నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు. మొత్తం 22 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం మార్గం ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రతి భక్తుడికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం లభించాలని ఆయన ఆకాంక్షించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి నిధులు

రాష్ట్రంలోని 22 ప్రధాన దేవాలయాలకు రూ.40 కోట్లతో రహదారి సదుపాయాలు కల్పిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏలూరు జిల్లాలోని ఐ.ఎస్. జగన్నాథపురం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఘాట్ రహదారి నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. అలాగే కోటప్పకొండ, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కూడా ప్రత్యేక నిధులు కేటాయించినట్లు చెప్పారు. దేవాదాయ శాఖ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. భక్తులకు సౌకర్యాలు పెంపొందించడం ద్వారానే ఆధ్యాత్మిక క్షేత్రాల ప్రతిష్ట పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha