Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: చంద్రబాబు, పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు

AP: చంద్రబాబు, పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన వ్యక్తిపై కేసు

వార్త 4 months ago

(AP)ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న వారిపై విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు.

అయినప్పటికీ కొందరు నేతలపై దుర్భాషలాడుతూ, తప్పుడు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు రాజశేఖర్ రావు అనే వ్యక్తిపై ఫిర్యాదు అందింది. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కేసు నమోదు సైబర్ క్రైమ్ పోలీసులు

ఈ సందర్భంగా(AP) సైబర్ క్రైమ్ పోలీసు అధికారులు మాట్లాడుతూ… సోషల్ మీడియా ద్వారా ఫొటోలను మార్ఫింగ్ చేసి, అసత్య ప్రచారం చేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు. ప్రముఖుల ఫొటోలను ఎడిట్ చేసి, అసభ్యకరంగా చిత్రీకరిస్తే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha