Dailyhunt
AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల

వార్త 1 month ago

ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల కోసం రూ.

1,200 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం రోజున ఏపీ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ఏపీ ప్రభుత్వం విడతల వారీగా విడుదల చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో విద్యార్థుల ఖాతాలలో జమ చేస్తే.. కూటమి ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలో వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేస్తున్నారు.

Collector Himanshu Shukla: ప్రభుత్వ బ్యాంక్ ఖాతాలపై కలెక్టర్ సమీక్ష

ఆయా కాలేజీలకు రీయింబర్స్ మెంట్

రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు పోస్ట్-మెట్రిక్ కోర్సుల్లో పూర్తి ట్యూషన్ ఫీజును ఆయా కాలేజీలకు రీయింబర్స్ మెంట్ చేస్తున్నారు. జ్ఞానభూమి పోర్టల్ ద్వారా వీటికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపులు, మైనార్టీలకు దీన్ని వర్తింపజేస్తున్నారు. ఇందులో ట్యూషన్, స్పెషల్, ఇతర, పరీక్ష ఫీజులను కాలేజీ ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నారు. అలాగే మెయింటెనెన్స్ ఫీగా ఆహారం, హాస్టల్ ఖర్చులకు ఐటీఐ విద్యార్ధులకు 10 వేలు, పాలిటెక్నిక్‌కు 15వేలు, డిగ్రీ, పైన విద్యార్ధులకు 20 వేలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

APMIP Services : రైతులకు వాట్సాప్ లో APMIP సేవలు - అచ్చెన్న

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha