Dailyhunt
AP: నకిలీ మద్యం కేసు.. నిందితులకు మూడు రోజులపాటు కస్టడీ

AP: నకిలీ మద్యం కేసు.. నిందితులకు మూడు రోజులపాటు కస్టడీ

వార్త 3 months ago

ఆంధ్రప్రదేశ్‌(AP)లో వెలుగుచూసిన నకిలీ మద్యం కేసు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో భాగంగా మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించిన ఎక్సైజ్ శాఖ అధికారులు, పూర్తి స్థాయి విచారణ కోసం వారిని కస్టడీకి అప్పగించాలని తంబళ్లపల్లి న్యాయస్థానం లో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై కోర్టులో విచారణ జరగగా, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఐదుగురు నిందితులను మూడు రోజుల పాటు ఎక్సైజ్ కస్టడీకి అనుమతించింది.

Read also: YS Jagan: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ కుటుంబం

ఎక్సైజ్(Excise) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నకిలీ మద్యం(Fake alcohol) తయారీ వెనుక ఉన్న ముఠా గురించి మరిన్ని కీలక సమాచారం సేకరించేందుకు కస్టడీ అవసరమని కోర్టుకు వివరించారు. మద్యం తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాల సరఫరా మార్గాలు, పంపిణీ కేంద్రాలు, ఇందులో భాగమైన ఇతర వ్యక్తుల వివరాలను వెలికితీసేందుకు విచారణ కొనసాగించనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం ఈ కేసులో నిందితులు మదనపల్లె సబ్‌జైల్లో న్యాయ రిమాండ్‌లో ఉన్నారు. కోర్టు అనుమతితో వారిని కస్టడీకి తీసుకుని ప్రశ్నించిన అనంతరం తిరిగి జైలుకు తరలించనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో జిల్లాలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై నిఘా మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం. అక్రమ మద్యం వల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha