Dailyhunt
YS Jagan: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ కుటుంబం

YS Jagan: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్ కుటుంబం

వార్త 3 months ago

క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వైసీపీ(YCP) అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్,(YS Jagan) తన కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలో సందడి చేశారు.

గురువారం ఉదయం, స్థానిక సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. పులివెందులలో జరిగిన ఈ పర్యటనలో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతి రెడ్డి కూడా ఆయనతో పాటు చర్చి సందర్శించారు.

ప్రార్థన అనంతరం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

ప్రార్థనలు ముగిసిన తర్వాత, జగన్ చర్చి వెలుపల ఉన్న అభిమానులు, స్థానికులకు అభివాదం చేస్తూ, క్రిస్మస్ శుభాకాంక్షలు (YS Jagan) తెలిపారు. ఈ సందర్భంగా, ఆయన రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ పర్యటన సమయంలో పులివెందులలో వైసీపీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చర్చి పరిసరాల్లో పటిష్ఠమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడింది.
Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Nara Lokesh: పేదలకు మెడికల్ సీట్లు, సూపర్ స్పెషాలిటీ సేవలు పీపీపీతో సాధ్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha