Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ

AP: నేడు భీమవరం నియోజకవర్గ నేతలతో వైఎస్ జగన్ భేటీ

వార్త 4 months ago

ఆంధ్రప్రదేశ్ (AP) లోని, తాడేపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు.. ఉదయం 11 గంటలకు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ఆయన భేటీ అవుతారు.

ప్రధానంగా నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశం భీమవరం నియోజకవర్గంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

AP: త్వరలో DSC నోటిఫికేషన్: మంత్రి సవిత

శ్రేణులకు దిశానిర్దేశం

ప్రతి బుధవారం రాష్ట్రంలోని ఒక నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు, వైసీపీ ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించుకున్న పార్టీ అధినేత వైఎస్ జగన్ గత వారం ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక నేతలతో సమావేశమయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిణామాలను వివరించిన వైఎస్ జగన్ .. పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన చర్యల గురించి శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha