Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP New Map 28 Districts: అమరావతి రాజధానిగా నూతన మ్యాప్ విడుదల

AP New Map 28 Districts: అమరావతి రాజధానిగా నూతన మ్యాప్ విడుదల

వార్త 2 months ago

AP New Map 28 Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా విభాగంలో ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది. పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్రంలోని జిల్లాల సంఖ్యను 28కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు 28 జిల్లాలతో కూడిన నూతన అధికారిక మ్యాప్‌ను ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసింది. ఈ ప్రకటనలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. విడుదల చేసిన మ్యాప్‌లో రాష్ట్ర రాజధానిగా ‘అమరావతి’ని స్పష్టంగా పేర్కొనడం.

Read Also:Nara Lokesh Sindhanur Visit: సింధనూరులో నారా లోకేష్‌కు ఘనస్వాగతం.. కుమారస్వామితో కలిసి భారీ బైక్ ర్యాలీ!

AP New Map 28 Districts: కొత్తగా ఏర్పడిన రెండు జిల్లాలు ఇవే

గతంలో ఉన్న 26 జిల్లాలకు అదనంగా మరో రెండు కొత్త జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

  1. మార్కాపురం జిల్లా: ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలను వేరు చేస్తూ, మార్కాపురం కేంద్రంగా ఈ నూతన జిల్లాను రూపొందించారు. వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంతాల అభివృద్ధికి ఇది దోహదపడనుంది.
  2. పోలవరం జిల్లా: పశ్చిమ గోదావరి మరియు ఏలూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను కలుపుతూ, పోలవరం కేంద్రంగా మరో జిల్లాను ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, ప్రాజెక్టు పనుల వేగవంతం మరియు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 AP New Map 28 Districts New map released with Amaravati as capital

13 నుండి 28కి చేరిన జిల్లాల సంఖ్య

ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 13 జిల్లాలుగా ఉన్న ఏపీ, గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 26 జిల్లాలుగా రూపాంతరం చెందింది. ఇప్పుడు తాజాగా మరో రెండు జిల్లాలు తోడవడంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 28కి చేరింది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు, మారుమూల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ పునర్విభజన చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది.

రాజధానిపై సందిగ్ధతకు తెర!

గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో రాజకీయంగా, న్యాయపరంగా నెలకొన్న సందిగ్ధతకు ఈ నూతన మ్యాప్ విడుదల ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టతనిచ్చినట్లయింది. అధికారిక మ్యాప్‌లో అమరావతిని రాజధానిగా ముద్రించడం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలపై ప్రభుత్వం తన వైఖరిని చాటిచెప్పింది. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుబాటులోకి వస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha