Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
AP: సైనా నెహ్వాల్‌పై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు

AP: సైనా నెహ్వాల్‌పై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు

వార్త 4 months ago

ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై, ఆంధ్రప్రదేశ్ (AP) మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశంసల వర్షం కురిపించారు. భారత క్రీడా రంగానికి ఆమె చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.

సైనా నెహ్వాల్ నిజమైన మార్గదర్శకురాలని, భారత బ్యాడ్మింటన్ దశ దిశను మార్చిన ఘనత ఆమెకే దక్కుతుందని లోకేశ్ పేర్కొన్నారు.కేవలం తన పట్టుదల, అత్యుత్తమ ఆటతీరుతో భారత బ్యాడ్మింటన్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని మంత్రి ప్రశంసించారు.

AP: ఒక నెలలో రైల్వే పోర్షన్ తొలగిస్తాం: మంత్రిపెమ్మసాని

మరిన్ని విజయాలు

సైనా క్రీడా ప్రయాణం ఎంతోమంది భారతీయ యువతలో స్ఫూర్తి నింపిందని, పెద్ద కలలు కనేలా చేసిందని తెలిపారు. మైదానంలో భయం లేకుండా ఎలా పోటీపడాలో నేటి తర్వానికి ఆమె నేర్పించారని అన్నారు.సైనా వదిలి వెళుతున్న ఈ గొప్ప వారసత్వానికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఆమె తన తదుపరి జీవితంలోనూ మరిన్ని విజయాలు సాధించాలని, భవిష్యత్తు సాఫీగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు నారా లోకేశ్ తన సందేశంలో వెల్లడించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha