Simhachalam Temple: శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా, నేడు అత్యంత ఆసక్తికరమైన 'అంగుళీయక అన్వేషణ' (ఉంగరాల వేట) ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.
భక్తికి వినోదాన్ని జోడించి, స్వామివారి లీలలను కళ్లకు కట్టేలా నిర్వహించిన ఈ ఘట్టం భక్తజనులను మంత్రముగ్ధులను చేసింది. కళ్యాణ సమయంలో అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన బంగారు ఉంగరం కనిపించకుండా పోయిందనే నెపంతో ఈ సరదా ఉత్సవాన్ని నిర్వహించడం ఇక్కడి అనాదిగా వస్తున్న ఆచారం.
Appanna’s Ring Hunt Festival
Simhachalam Temple: ఉంగరం కోసం స్వామివారి అన్వేషణ
అమ్మవారి ఆగ్రహంతో ఉంగరం లేకుండా ఆలయం లోకి ప్రవేశం లేదని అమ్మవారు తలుపులు మూసి వేయడంతో, స్వామివారు మహారాజా అలంకారంలో తన పరివారంతో కలిసి గ్రామ వీధుల్లో ఆన్వేషణకు బయలుదేరారు. ఈ అన్వేషణలో భాగంగా స్వయంగా ఆలయ ఈవో జె. వెంకట్రావు దంపతులతో పాటు, సహాయ ఈఓలు, పోలీసులు, పలువురు భక్తులను స్వామివారి పరివారం బందీలుగా పట్టుకోవడంవారిని ఉత్కంఠభరిత విచారణచేయడం విశేషం, ఉంగరం ఎక్కడుందో చెప్పాలంటూ వారిని విచారించిన తీరు భక్తులకు కనువిందు చేసింది.
చివరకు పట్టు పీతాంబరాల్లో లభించిన ఉంగరం
ఎక్కడ వెతికినా దొరకని ఉంగరం, చివరకు స్వామివారి పట్టు పీతాంబరాల్లోనే లభించడంతో ఉత్కంఠ వీడి భక్తులందరూ హర్షధ్వానాలు చేశారు. ఈ ఉత్సవమంతటనీ దేవస్థానం స్థానం కార్యనిర్వహణాధికారి జె. వెంకట్రావు అత్యంత ప్రణాళికాబద్ధంగా, శాస్త్రోక్తంగా నిర్వహించారు. కేవలం పరిపాలనకే పరిమితం కాకుండా, సంప్రదాయ ఉత్సవంలో స్వయంగా బందీగా పాల్గొని భక్తులలో భక్తి భావాన్ని ఉత్సాహాన్ని నింపారు. అనంతరం స్వామి అమ్మవార్ల మధ్య జరిగిన సంవాద సేవతో అన్వేమ ఉత్సవం మంగళప్రదంగా ముగిసింది. వేలాది. తరలివచ్చిన భక్తులు సింహగిరిపై సాగిన ఈ అద్భు దృశ్యాన్ని దర్శించుకుని భక్తి పారవశ్యంతా మునిగితేలారు. సింహగిరిపై నిర్వహించిన వినోదోత్సవం అందరినీ ఆనందంపజేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

