Dailyhunt
ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం

ఉపాధ్యాయ సమస్యలపై ఐక్యపోరాటం

వార్త 2 weeks ago

రాష్ట్రస్థాయి రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక డిమాండ్

AP Registered Teacher Meeting: విజయవాడలోని స్వాతంత్ర సమరయోధుల భవనం నందు రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ఎపిటిఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షులు సివి ప్రసాద్ అధ్యక్షత వహించారు. సివిప్రసాద్ మాట్లాడుతూ 30 రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల పైగా కలయికతో ఐక్యవేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇన్ని సంఘాలు ఏకమై సమస్యల సాధన కోసం జతకట్టడం ఇదే మొదటి సారి అని తెలిపారు.

Read Also: Nellore Bus Accident: నిద్రలో ఉండగా పల్టీలు కొట్టిన బస్సు.. నెల్లూరు జిల్లాలో తప్పిన ప్రమాదం

 Demand by the Joint Forum of State-Level Registered Teachers’ Associations

AP Registered Teacher Meeting: సమస్యల సాధన కోసం జతకట్టిన సంఘాలు

రిజిస్టర్ సంఘాలను రాష్ట్ర విద్యాశాఖ చర్చలకు పిలవకుండా కేవలం రికగ్నైజ్డ్ సంఘాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఐక్యవేదిక ఖండిస్తున్నదనీ అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, ఉపాధ్యాయుల అపరిస్క త సమస్యల సాధన కోసం, పిఆర్సి, ఐఆర్, డిఏ, పాత బకాయిలు ఆర్థికపరమైన సమస్యలు పొందడంపై కార్యాచరణ ఏర్పాటు చేయడం కోసం రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు

సమావేశంలో కృష్ణమోహన్ (టిఎనీయు ఎస్ఎపి), శరత్చంద్ర (బిటియే అమరావతి), సోమరౌతు శ్రీనివాస రావు (పిఎంటిఎఫ్), గంగాభవాని, వీర రాఘవరావు (జివిటి), అన్నం శ్రీనివాస్, వాసవి సురేష్ (పిటిఎఫ్), కాజా రహమతుల్లా (ఆర్బిఏ), ఇర్ఫాన్ అలీ ఖాన్ (ఏఐఐటిఏ), పద్మజ (మహిళా ఉపాధ్యాయ సంఘం), టీవీ రామకృష్ణ (ఎంఇఓ2 అసోసియేషన్), శ్రీనివాసులు (ఎపిపిఎస్ హెచ్ఎం అసోసియేషన్), పెంచలయ్య (ఎంటిఏ), సుధాకర్ రెడ్డి (ఎస్టియుడి), గణేష్ (దివ్యాంగుల టీచర్స్ అసోసియేషన్), వెంకట సుబ్బయ్య, వీరయ్య (ఎపిపిజిటిఏ), చందనరావు (ఎస్టిఏ), పూర్ణచంద్ర నాయక్(ఎపిటిడబ్ల్యూటిఏ), అమర్నాథ్ (ఆదివాసి టీచర్స్ అసోసియేషన్), లక్ష్మణ్ (ఎపిజిటిడబ్ల్యూఎఎస్ సిఆర్ ఏ), పోలయ్య ఎస్ఏ, సోమశేఖర్ (ఎస్), రెడ్డమ్మ (అమరావతి టీచర్స్ అసోసియేషన్) తో పాటు ఎస్సీ, ఎస్టీ యు ఏపీ, ఎస్సీ, ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్, బిటియు ఎపి, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ (జయరాం నాయక్ వర్గం), ఇతర సంఘాలు మద్దతు పలికాయి.

రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర కమిటీ ఎన్నిక

ఉపాధ్యాయ సంఘాల సమావేశం లో రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజే షన్, రుసో రాష్ట్ర కమిటీ ఎన్నిక జరిగింది. రిజిస్టర్ ఉపాధ్యాయ సంఘాల యునైటెడ్ ఆర్గనైజేషన్ చైర్మన్ గా సివి ప్రసాద్, సెక్రటరీ జనరల్ గా సోమరౌతు శ్రీనివాసరావు, కోశాధికారిగా ఎం. మీరయ్య, కో చైర్మన్లుగా ఎస్.రాజేశ్వరి, ఆర్. సుధాకర్ రెడ్డి, అన్నం శ్రీనివాస్, ఖాజా రహమతుల్లా, ఎం.అమర్నాథ్, కే.పూర్ణచంద్రనాయక్, శ్రీనివాసులు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ డి. పెంచలయ్య, గణేష్, లక్ష్మణ్, పారయ్యలు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

"బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి".. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha