Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) హయాంలో వ్యవస్థలన్నీ ధ్వంసమై, రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసిందని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నాడు కనీసం ప్రజలను కలవడానికి కూడా భయపడి ‘పరదాల పాలన’ సాగించారని, కానీ నేడు కూటమి ప్రభుత్వంలో పారదర్శకమైన ‘ప్రజాపాలన’ నడుస్తోందని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో అనాలోచిత విధానాల వల్ల రాష్ట్రంపై ఏకంగా రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం మోపారని బాబు మండిపడ్డారు. నాటి పాలకుల వేధింపుల భరించలేక పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని వదిలి పారిపోయారని.. సాధారణ ప్రజలు సైతం నిత్యం భయాందోళనల మధ్య గడపాల్సి వచ్చిందని నాటి దుస్థితిని ఆయన గుర్తుచేశారు.
Read Also : తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు-టిప్పర్ ఢీ.. ఐదుగురికి గాయాలు

గాడిలో పడుతున్న ఏపీ ఆర్థిక వ్యవస్థ.. పెట్టుబడులు, కేంద్ర నిధులే లక్ష్యంగా ప్రక్షాళన!
ధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి సరైన మార్గంలోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం రాత్రింబవళ్లు ఎంతో కష్టపడాల్సి వస్తోందని చంద్రబాబు నాయుడు వివరించారు. అధికారంలోకి రాగానే ముందుగా ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేశామని, గత ప్రభుత్వం చేసిన గుట్టలకొద్దీ అప్పులను రీషెడ్యూల్ చేయించి రాష్ట్రానికి ఆర్థిక ఊరట కలిగించామని ఆయన తెలిపారు. ఇప్పుడు ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను తిరిగి నిలబెట్టి, కొత్త పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా.. అమరావతి, పోలవరం వంటి కీలక ప్రాజెక్టుల పూర్తి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రజలంతా భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ప్రార్థనా మందిరాల శబ్ద కాలుష్యంపై రఘురామకృష్ణంరాజు స్ట్రాంగ్ వార్నింగ్!

