Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు-టిప్పర్ ఢీ.. ఐదుగురికి గాయాలు

తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు-టిప్పర్ ఢీ.. ఐదుగురికి గాయాలు

వార్త 3 weeks ago

Tirumala accident: తిరుమల రెండవ ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బస్సు ఒకటి టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

అలిపిరి తనిఖీ కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ఇద్దరు చిన్న పిల్లలు, ముగ్గురు పెద్దలు ఉన్నారు.

Read also: Roddam Tragedy: తల్లిదండ్రులకు తీరని వేదన.. నీటి కుంటలో మునిగి ముగ్గురు పిల్లలు మృతి

 Accident on the Tirumala Ghat Road

స్పందించిన అధికారులు – క్షతగాత్రులకు చికిత్స

ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, టీటీడీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భక్తులను వేగంగా అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలంలో బస్సు, టిప్పర్ నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వాహనాలను పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Tirumala accident: విచారణ చేస్తున్న పోలీసులు

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ వేగం వల్ల ప్రమాదం జరిగిందా లేదా ఇతర సాంకేతిక కారణాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులు ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ప్రార్థనా మందిరాల శబ్ద కాలుష్యంపై రఘురామకృష్ణంరాజు స్ట్రాంగ్ వార్నింగ్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha