Kadapa crime: వైయస్సార్ జిల్లాలోని పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం మల్లెల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. షేక్ బీబీ (58), ఆమె కూతురు షేక్ ఇమాంబి (35) తమ నివాసంలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గ్రామస్థుల సమాచారం మేరకు, తల్లి-కూతురు ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
Read also: Ganderbal Encounter: జమ్మూకాశ్మీర్ గందర్‌బల్‌లో ఎన్‌కౌంటర్.. అడవిలో నక్కిన ఉగ్రవాది హతం

Mother and Daughter Die Under Burden of Debt
Kadapa crime: అప్పుల ఊబిలో కుటుంబం
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఇదే సమయంలో కుటుంబ పెద్ద షేక్ ఇమామ్ భాష ఇంటిలో కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కుటుంబం అప్పుల భారంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలపై స్పష్టత కోసం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు, పొరుగువారిని ప్రశ్నించి వివరాలు సేకరిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

