Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అప్పుల చర్చపై సవాళ్లు.. జూపల్లి కోసం తెలంగాణ భవన్‌లో కుర్చీ

అప్పుల చర్చపై సవాళ్లు.. జూపల్లి కోసం తెలంగాణ భవన్‌లో కుర్చీ

వార్త 2 days ago

Minister Jupally vs BRS Debate: తెలంగాణలో రాష్ట్ర అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య చెలరేగిన సవాళ్ల పర్వం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

అప్పుల లెక్కలపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌కు వస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించడంతో.. బీఆర్ఎస్ నేతలు అందుకు పూర్తి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ భవన్‌ వేదికగా మంత్రి జూపల్లి కోసం ప్రత్యేకంగా ఆయన పేరు రాసి ఉన్న ఒక కుర్చీని కూడా సిద్ధం చేసి, బీఆర్ఎస్ శ్రేణులు ఆయన రాక కోసం వేచి చూశాయి.

Read Also: Bandi Sanjay: కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు చూస్తే బిగ్ బాస్ షో చూస్తున్నట్టుంది: బండి సంజయ్

 We are ready for a discussion; it was the Congress ministers who backed down: KTR

Minister Jupally vs BRS Debate: మాట మార్చి గన్‌పార్క్‌కు వెళ్లిన మంత్రి జూపల్లి

అయితే, ముందుగా అనుకున్నట్లు తెలంగాణ భవన్‌కు వెళ్లకుండా మంత్రి జూపల్లి కృష్ణారావు నేరుగా గన్‌పార్క్‌కు చేరుకున్నారు. గన్‌పార్క్ అమరవీరుల స్తూపం వద్దకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులే నేరుగా వచ్చి చర్చకు కూర్చోవాలంటూ జూపల్లి అక్కడ నుండి సరికొత్త సవాల్ విసిరారు. దీంతో ఇరుపక్షాల మధ్య సవాళ్లు మరింత ముదిరాయి. మంత్రి జూపల్లి సవాల్‌ను స్వీకరించిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆయనతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గన్‌పార్క్‌ వైపు నడిచేందుకు బయలుదేరారు. అయితే, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందనే ఉద్దేశంతో పోలీసులు తెలంగాణ భవన్ ప్రధాన ద్వారం వద్దే కేటీఆర్ పాదయాత్రను అడ్డుకున్నారు. ముందుకు వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

తెలంగాణ భవన్ వద్ద తీవ్ర తోపులాట, ఉద్రిక్తత

పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగాయి. పోలీసుల బారికేడ్లను దాటుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య పెద్ద ఎత్తున తోపులాట, నెట్టివేతలు జరిగాయి. ఈ పరిణామాలతో తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని చర్చల నుండి పారిపోతోందని బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు.

Epaper: epaper.vaartha.com

చర్చకు మేం సిద్ధం.. వెనక్కి తగ్గింది కాంగ్రెస్ మంత్రులే: కేటీఆర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha