Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అరకులో 'సంజీవని' సేవలను ప్రారంభం.. సీఎం

అరకులో 'సంజీవని' సేవలను ప్రారంభం.. సీఎం

వార్త 3 weeks ago

CM Chandrababu: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఒక పటిష్ఠమైన వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

ఇందులో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ‘సంజీవని’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అరకులోయ మండలం గన్నెల గ్రామంలో పర్యటించిన ఆయన, పలు ‘ఆరోగ్య రథాల’ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాల ద్వారా మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజల ముంగిటకే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

Read Also : PG Doctors New Rules: ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

 ‘Sanjeevani’ services launched in Araku: CM

CM Chandrababu: కొండ ప్రాంతాల్లోని ప్రజలకే ప్రాధాన్యం

ఆరోగ్య రథాల ప్రారంభోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కొండ ప్రాంతాల్లోని ప్రజలు వైద్యం కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించాల్సిన దుస్థితి ఉండకూడదన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఉద్ఘాటించారు. ఈ సమస్యను శాశ్వతంగా అధిగమించేందుకే ‘సంజీవని’ కార్యక్రమాన్ని రూపొందించామని, దీనిని రాష్ట్రవ్యాప్తంగా విడతలవారీగా విస్తరిస్తామని వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికీ సమర్థవంతమైన వైద్యం అందించడంతో పాటు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు యోగా, ధ్యానం వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు.

వైద్య సేవలతో పాటు మారుమూల ప్రాంతాలకు కనెక్టివిటీ అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో నెట్‌వర్క్ మరియు సిగ్నల్ సమస్యలను పరిష్కరించేందుకు పెద్ద సంఖ్యలో సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

భోగాపురం విమానాశ్రయానికి ‘అల్లూరి’ పేరు

గతంలో విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఈ ప్రాంత గిరిజనులకు ఆయుర్వేద వైద్యం అందించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుడి త్యాగాన్ని, సేవలను నిత్యం స్మరించుకునేలా కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం (భోగాపురం) కు ఆయన పేరునే నామకరణం చేసినట్లు తెలిపారు. అదేవిధంగా గిరిజన కళాకారులు థింసా నృత్యంతో గిన్నీస్ వరల్డ్ రికార్డు సృష్టించడంపై హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలియజేశారు.

గోదావరి పులసకు ఆకాశాన్నంటిన ధర

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha