Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీలో పీజీ వైద్యులకు కొత్త నిబంధనలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

వార్త 3 weeks ago

PG Doctors New Rules: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న పీజీ వైద్య విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకుంది.

పీజీ వైద్యుల విధులు, పనివేళలు మరియు సెలవులకు సంబంధించి గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ విష్ణువర్ధన్ ఆదేశించారు. పీజీ విద్యార్థులతో 24 గంటలకు మించి వరుసగా డ్యూటీలు చేయించకూడదని ఆయన స్పష్టం చేశారు.

Read Also : Nandamuri Harikrishna: నందమూరి హరికృష్ణ వర్ధంతి.. ఘనంగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్

 New regulations for PG medical students in AP; government takes a key decision.

PG Doctors New Rules: నైట్ డ్యూటీల అనంతరం తప్పనిసరి సెలవు

నైట్ డ్యూటీలు చేసే పీజీ వైద్యుల విశ్రాంతిని పరిగణనలోకి తీసుకుని, డ్యూటీ ముగిసిన మరుసటి రోజు వారికి తప్పనిసరిగా ఆఫ్ (సెలవు) ఇవ్వాలని సూచించారు. దీనితో పాటు ప్రతి వారం ఒక రోజు పూర్తిస్థాయి సెలవును కేటాయించాల్సి ఉంటుంది. ఈ విధులను నిర్వహించడంలో, నిబంధనలను పాటించడంలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లపై కఠిన చర్యలు ఉంటాయని డీఎంఈ హెచ్చరించారు.

ఒత్తిడి నివారణకు ప్రత్యేక కౌన్సెలింగ్

నిరంతర విధులతో పీజీ విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య కళాశాలలు, ఆసుపత్రుల యాజమాన్యాలు క్రమం తప్పకుండా.

  • కౌన్సెలింగ్ సెషన్లు
  • టైమ్ మేనేజ్‌మెంట్ వర్క్‌షాప్‌లు
  • స్ట్రెస్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌లను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

సెలవులు, పనివేళల వివరాలు

పీజీ వైద్య విద్యార్థుల అర్హత పరిధిలో లభించే సెలవుల వివరాలను డీఎంఈ నిబంధనలలో స్పష్టంగా పేర్కొన్నారు.

  • పెయిడ్ క్యాజువల్ లీవులు: ఏడాదికి 20 రోజులు
  • అకడమిక్ లీవులు: ఏడాదికి 5 రోజులు
  • వారాంతపు సెలవులు: ఏడాదికి 52 రోజులు

వైద్య విద్యార్థుల ఆరోగ్యం, వారి మానసిక ప్రశాంతతను కాపాడటం ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని, అందుకే ఈ మార్గదర్శకాలను రాజీలేకుండా అమలు చేయాలని అన్ని బోధనాసుపత్రులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి.

జగన్‌పై రామ్మోహన్ నాయుడు తీవ్ర విమర్శలు.. రాష్ట్రాన్ని నాశనం చేయడమే లక్ష్యమని ఆరోపణ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha