Telangana Unseasonal Rains: అన్నదాతలను అకాల వర్షాల భయం వెంటాడుతోంది. ఉదయం, పగలు ఎండకాస్తూ రాత్రిళ్లలో ఈదురుగాలులతో కురుస్తున్న వడగళ్ల వర్షాలకు పొట్ట దశలో ఉన్న వరి, రంకిముదిరే దశలో ఉన్న మొక్కజొన్న పంటలతోపాటు మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.
మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన పసుపు తడిసిపోతోంది. వారం, పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అర్థరాత్రి ఈమరుగాలు లతో కూడిన వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో అర్ధరాత్రి విరుచుకుపడుతున్న ఆకాల వర్షానికి పంటలు అతలాకుతలమవుతున్నాయి. ఎన్నో ఆశలతో సాగు చేసిన వంటలు నిమిషాల వ్యవధిలో విరుచుకుపడుతున్న ఆకాల వర్షాలకు బలవుతున్నాయి.
Read Also: Harish Rao: రైతులు దళారులకు అమ్ముకొని నష్టపోవద్దు

అన్నదాతలు ఆవేదన వ్యక్తం
వరి, మొక్కజొన్న పంటలు నేలవాలుతుండగా మామిడికాయలు నేలరాలుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వరి వంట పొట్ట దశలో ఉంది. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలకు వరి నేలవాలుతోంది. ఇక అక్కడక్కడా కురుస్తున్న వడగళ్లు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. మొక్కజొన్న కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం మార్ఫెడ్ను ఆదేశించినా ఆ సంస్థ ఆలస్యంగా కొనుగోళ్లు చేపడుతోంది. దీంతో మొక్కజొన్నను మార్కెట్కు తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో అకాల వర్షాలకు మార్కెట్ యార్డుల్లోనే మొక్కజొన్న రాశులు తడిసి ముద్దవుతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో రానున్న అయిదు రోజులపాటు అకాల వర్షాలు కురుస్తాయన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు రైతుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తున్నాయి.
Telangana Unseasonal Rains: ఏడోతేదీ దాకా అకాల వర్షాలు…
హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం శుక్రవారం రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 3040 కి.మీ) తో కూడిన వర్షాలు కురిస్తాయి. అదేవిధంగా శనివారం రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 3040 కి.మీ)తో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

