Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్ధరాత్రి దారుణం.. తల్లి ఒడిలో ఉండగానే చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు!

అర్ధరాత్రి దారుణం.. తల్లి ఒడిలో ఉండగానే చిన్నారిని ఎత్తుకెళ్లిన దుండగులు!

వార్త 1 month ago

Quthbullapur crime: హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి ఒక దారుణమైన ఘటన జరిగింది. రహదారి పక్కన తన తల్లి పక్కన గాఢనిద్రలో ఉన్న ఆరు నెలల పసిపాపను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు.

మల్లారెడ్డి ఆస్పత్రి సమీపంలో ఉన్న ఒక మార్బుల్ షాపు వద్ద ఈ కిడ్నాప్ జరిగినట్లు తెలుస్తోంది. కన్నతల్లి కళ్లముందే పాప కనిపించకుండా పోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి.

Read also: Jubilee Hills Instagram Trap:19 మంది బాలికలను ట్రాప్ చేసిన అన్నదమ్ములు !

 Police checking CCTV for missing baby

Quthbullapur crime: నిద్రిస్తుండగా దారుణం

నవనీత అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఫుట్‌పాత్ పక్కన నిద్రిస్తున్న సమయంలో ఈ అపహరణ చోటుచేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు ప్లాన్ ప్రకారం వచ్చి, చిన్నారి ఆశను తల్లి ఒడి నుంచి తీసుకెళ్లారు. తెల్లవారుజామున నిద్రలేచిన తల్లి తన పక్కన పాప లేకపోవడంతో షాక్‌కు గురైంది. చుట్టుపక్కల ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

రంగంలోకి పోలీసులు.. సీసీ ఫుటేజ్ పరిశీలన

బాధిత తల్లి ఫిర్యాదు మేరకు కుత్బుల్లాపూర్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా విజువల్స్‌ను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. అనుమానితుల కదలికల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

హైదరాబాద్ శివారులో 42 ఎకరాల ఆధునిక కూరగాయల మార్కెట్ ఏర్పాటు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha