Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం.. తడిసిముద్దైన వరి ధాన్యం

అర్ధరాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం.. తడిసిముద్దైన వరి ధాన్యం

వార్త 2 weeks ago

Sangareddy Rains News: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో అర్ధరాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

చౌటాకూర్ మండలంలోని 161 జాతీయ రహదారిపై ఆరబోసిన వరి ధాన్యం పూర్తిగా తడిసిముద్దైంది. అలాగే కోర్పోల్, ఉప్పరిగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి కూడా వర్షానికి తడవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

Read Also :Telangana Monsoon 2026: తెలంగాణలో ఆలస్యంగా రానున్న రుతుపవనాలు!

Sangareddy Rains News:జాతీయ రహదారిపై కొట్టుకుపోయిన వరి కుప్పలు

ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. లారీల కొరతతో పాటు మ్యాచింగ్ సమస్యలను సాకుగా చూపుతూ అధికారులు కొనుగోళ్లు ఆలస్యం చేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తమకు ఈ పరిస్థితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వర్షానికి తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా పుల్కల్, చౌటాకూర్ మండలాల్లో 45.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

వడ దెబ్బకు మరో 24 మంది బలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha