Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వడ దెబ్బకు మరో 24 మంది బలి

వడ దెబ్బకు మరో 24 మంది బలి

వార్త 2 weeks ago

AP Weather Update: కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరు గరిష్ట ఉష్ణోగ్రత 48.1° ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హితవు. రాష్ట్రంలో ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరింది.

వడగాల్పులు అధికంగానే ఉన్నాయి. ప్రాథమిక సమాచారాన్ని అనుసరించి నేడు 24 మంది వడదెబ్బకు మృతి చెందారు. వీరిలో అత్యధికం 16మంది ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ఉన్నారు. విజయవాడలో ఇద్దరు వడదెబ్బకు పాదచారుల బాటలో మరణించి ఉండగా పోలీసులు గుర్తించారు. ఏలూరు, విశాఖ, శ్రీకాకుళం, మన్యం జిల్లా ఇద్దరేసి చొప్పున వడదెబ్బకు గురయి మరణించారు. అధికారికంగా ఈ మరణాలను దృవీకరించలేదు, సోమవారం కూడా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదయ్యాయి. సోమవారం కృష్ణా జిల్లా కంకిపాడు, పెనమలూరు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 48.1 డిగ్రీలు, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొన్నారు. 14 జిల్లాల పరిధిలోని 115 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా పల్నాడు 20, కృష్ణా 18, బాపట్ల 17, ఏలూరు 13, ఎన్టీఆర్ 13, గుంటూరు 11 మండలాల్లో ఎండ ఉధృతి ఎక్కువగా చూపిందన్నారు.

Read also: Telangana weather update: తెలంగాణకు వర్ష సూచన.. చల్లబడనున్న వాతావరణం!

 heat of the sun, due to the effects of sunstroke

AP Weather Update: ఎండల తీవ్రత పెరిగిన ప్రాంతాలు

బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడుజిల్లా పిడుగురాళ్లలో 46.3డిగ్రీలు, ఏలూరుజిల్లా కుక్కునూరు, పోలవరంజిల్లా కూనవరంలో 46.1, పశ్చి మగోదావరిజిల్లా తాడేపల్లిలో 45.7, ప్రకాశం(జి) కొప్పెరపాడు 45.4, కోనసీమ(జి) శివల, కాకినాడ (జి)కాజులూరులో 45.2, గుంటూరుజిల్లా మంగళగిరిలో 44.9, మార్కాపురంజిల్లా నందనమారెళ్లలో 44.7, విశాఖజిల్లా ములగాడ 44.4, తూర్పుగో దావరిజిల్లా పోతవరం 44.3డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎండలో బయటకు వెళ్లేటప్పుడు చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్తపడాలని, గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగరాదని సూచించారు. నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరినీరు, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. శనివారం వరకు ఈ తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. వీలైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసర ప్రయాణాల్లో తప్పనిసరిగా మంచినీరు వెంట తీసుకుని వెళ్లాలన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తెలంగాణలో మరో 2 గంటల్లో వర్ష సూచన!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha