Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అరేబియా అద్భుత జల వ్యవస్థతో సముద్రాన్ని మంచినీటిగా మారుస్తున్నది

అరేబియా అద్భుత జల వ్యవస్థతో సముద్రాన్ని మంచినీటిగా మారుస్తున్నది

వార్త 3 weeks ago

Saudi Arabia : ఎటు చూసినా మండే ఇసుక. వర్షం పడేది ఏడాదిలో కొన్నిరోజులే. నదులు అసలే లేవు. అయినా 3.7 కోట్ల మందికి తాగునీరు అందుతోంది. సముద్రాన్ని మంచినీటిగా మార్చి, వందల కిలోమీటర్ల దూరం ఎడారిలోకి తరలిస్తూ సౌదీ అరేబియా అద్భుత జల వ్యవస్థను నిర్మించింది.

సౌదీ అరేబియాలో 95 శాతానికి పైగా భూభాగం పొడి ఎడారి ప్రాంతమే. చాలా చోట్ల వార్షిక వర్షపాతం 100 మిల్లీమీటర్లకు కూడా చేరదు. వేసవిలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతాయి. అయినా దేశంలో 3.7 కోట్ల మందికి నీటి సరఫరా ఆగదు. దీనికి ప్రధాన ఆధారం సముద్రపు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లు. తీర ప్రాంతాల్లోని డీసాలినేషన్ ప్లాంట్ల నుంచి శుద్ధి చేసిన నీటిని భారీ పైపుల ద్వారా దేశం లోపలికి పంపిస్తారు. ఈ పైపుల నెట్‌వర్క్ వందల కిలోమీటర్లు విస్తరించింది. ఎడారి మధ్యలో ఒక కృత్రిమ నదిలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది.

Read Also: Lawrence Wong : ప్రపంచంలో అత్యధిక జీతం పొందే నేత.. రికార్డు స్థాయికి లారెన్స్ వాంగ్ వేతనం!

 Saudi Arabia

Saudi Arabia : అల్ట్రాసోనిక్ పరీక్షల తర్వాత తుప్పు పట్టకుండా ప్రత్యేక పూత

ఈ పైపులు సాధారణమైనవి కావు. దాదాపు 1.8 మీటర్ల వ్యాసంతో హై-స్ట్రెంగ్త్ కార్బన్ స్టీల్‌తో తయారు చేస్తారు. కొన్ని పైపుల పొడవు 12 నుంచి 18 మీటర్ల వరకు ఉంటుంది. దీంతో మార్గంలో జాయింట్లు తగ్గుతాయి. అల్ట్రాసోనిక్ పరీక్షల తర్వాత తుప్పు పట్టకుండా ప్రత్యేక పూత వేస్తారు. ఎడారిలో పైపుల ఏర్పాటు మరో పెద్ద సవాలు. జీపీఎస్, ఆధునిక సర్వే పరికరాలతో మార్గాన్ని ముందుగా గుర్తిస్తారు. శుద్ధి చేసిన మంచినీటిని తీరప్రాంతాల నుండి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధాని రియాద్ సహా ప్రధాన నగరాలు, ఎడారి ప్రాంతాలకు అందించేందుకు విస్తృతమైన భూగర్భ జల పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను నిర్మించింది.

1000కుపైగా విమానాలు రద్దు.. బ్రిటన్‌లో ప్రయాణికుల తిప్పలు..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha