Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు: నారాయణఖేడ్ ఎమ్మెల్యే

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు: నారాయణఖేడ్ ఎమ్మెల్యే

వార్త 1 month ago

Indiramma Illu Scheme Telangana: ఇండ్లు లేని ప్రతినిరుపేదకు పక్కా ఇల్లు కట్టించి ఇవ్వడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు.

మండల పరిధిలోని ఇసుకపాయల తాండ కు చెందిన రవీందర్ నాయక్ దంపతులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతన గృహంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి రవీందర్ నాయక్ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.

Read Also: Komatireddy Raj Gopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి.. తల్లి ఎలా అవుతుంది?.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫైర్

 MLA Sanjeeva Reddy Narayankhed

Indiramma Illu Scheme Telangana: గృహప్రవేశంలో సందడి

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కలను నిజంచేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కవిత, నాయకులు రాయిని మధుసూదన్, నారా గౌడ్, దాచ సంగమేశ్వర్, సుభాష్, రాజేందర్ గౌడ్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు పెరుమాళ్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తప్పుడు ప్రచారం ఆరోపణలతో కోర్టుకు వెళ్లిన నేత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha