Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి:జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

అర్జీదారుల సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి:జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

వార్త 1 week ago

Nellore News: జిల్లా లోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వస్తారని అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తిచెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు.

Read also:Minister Ponguru Narayana: వైఎస్ఆర్సీపీ వీధి నాటకాలను జనం నమ్మరు: మంత్రి నారాయణ

సోమవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార (పిజిఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాతో పాటు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ, జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్వో విజయకుమార్, మెప్మా పి.డి.కిరణ్ కుమార్, ఐటిడిఏ పిఓ శ్రీనివాసరావు ,సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగ శేఖర్ ..లు హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ…. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు .. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ, రీఓపెనింగ్.. లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు.

Nellore News: సుదూర ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. ప్రత్యేక క్యూ లైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఉచిత భోజన సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచారు. రెవిన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయగా, అర్జీదారులకు అవసరమైన ప్రాథమిక వైద్య సేవలు అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ, తెలుగు గంగ ప్రత్యేక అధికారులు కేశవర్ధన్ రెడ్డి, వంశీకృష్ణ, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ నాగ శేఖర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha