Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైఎస్ఆర్సీపీ వీధి నాటకాలను జనం నమ్మరు: మంత్రి నారాయణ

వైఎస్ఆర్సీపీ వీధి నాటకాలను జనం నమ్మరు: మంత్రి నారాయణ

వార్త 1 week ago

Minister Ponguru Narayana: నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు నోటీసులు ఇస్తే వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డెక్కి వీధి నాటకాలు వేయడం సిగ్గుచేటని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

రాజకీయ లబ్ధి కోసం చేసే డ్రామాలను జనం నమ్మరన్నారు.కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ సెల్ లో పాల్గొన్న మంత్రి వైఎస్ఆర్సీపీ ఆందోళనపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందించారు.

Read also: Radha Gayatri Death Case: రాధా గాయత్రి మృతి కేసు: భర్తపై హత్య కేసు నమోదు

 People will not believe YSRCP’s street plays: Minister Narayana

Minister Ponguru Narayana: నోటీసుల వ్యవహారంపై మంత్రి స్పష్టత

నెల్లూరులో ఎంఎల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాలేజీకి నోటీసులు ఇవ్వడంపై జరుగుతున్న రాద్ధాంతంపై మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. అసలు ఆ నోటీసుల వ్యవహారం తనకు తెలియనే తెలియదని, మొన్న భీమవరంలో నారాయణ విద్యాసంస్థలకు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారని, ఆ విషయాన్ని తన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు ఫోన్ చేసి చెబితేనే తనకు తెలిసిందని వెల్లడించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకోవాలి తప్ప రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదన్నారు.

గత ప్రభుత్వ వేధింపుల ప్రస్తావన

గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కక్షగట్టి నారాయణ గ్రూప్స్‌ను రకరకాలుగా వేధించారన్నారు.అప్పటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేరుగా వచ్చి ఆందోళన చేసినా తాము ఓపిక పట్టి అధికారుల క్లియరెన్స్ తెచ్చుకున్నామే తప్ప రాజకీయం చేయలేదని గుర్తుచేశారు. మీలా లబ్ధి పొందాలనుకుంటే అప్పట్లో రోజుకో ఆందోళన చేసేవాళ్లమన్నారు.కూటమి ప్రభుత్వం వ్యాపారస్తులను, విద్యాసంస్థలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టదని, ఎవరిపైనా కక్షపూరితంగా వ్యవహరించదని, తప్పు ఎక్కడ జరిగినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha