Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్నబ్ తుపాను బీభత్సం.. వరదలకు కొట్టుకుపోయిన వంతెనలు!

అర్నబ్ తుపాను బీభత్సం.. వరదలకు కొట్టుకుపోయిన వంతెనలు!

వార్త 3 weeks ago

Cyclone Arnab: ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అర్నబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. అనంతగిరి మండలంలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వంతెనలు దెబ్బతిన్నాయి.

దీంతో స్థానికంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Read Also :Cyclone Arnab: ఏపీ వైపు తుఫాన్.. గంటకు 150 కి.మీ. వేగంతో గాలులు!

తాడిగూడలో కొట్టుకుపోయిన వంతెన

అనంతగిరి పంచాయతీ పరిధిలోని తాడిగూడ గ్రామంలో భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా వంతెన కొట్టుకుపోయినట్లు సమాచారం. దీంతో గ్రామస్థులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వంతెనను పునర్నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

శివలింగపురం-కృష్ణాపురం మధ్య వంతెనకు నష్టం

అనంతగిరి మండలంలోని కొత్తూరు పంచాయతీ పరిధిలో శివలింగపురం-కృష్ణాపురం మధ్య ఉన్న వంతెనపై నుంచి వరద నీరు పొంగిపొర్లడంతో వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.

Cyclone Arnab: ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గోస్తని నది

మరోవైపు, మండలంలోని కాశీపట్నం వద్ద గోస్తని నది తుపాను ప్రభావంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నట్లు సమాచారం. భారీ వర్షాల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వంతెనలు దెబ్బతిన్న ప్రాంతాల్లో అధికారులు తగిన చర్యలు తీసుకుని రాకపోకలను పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.

'అర్నబ్' తరువాత మరో 10 తుపాన్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha