Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'అర్నబ్' తరువాత మరో 10 తుపాన్లు

'అర్నబ్' తరువాత మరో 10 తుపాన్లు

వార్త 0 months ago

Severe Cyclone 'Arnab' : పశ్చిమ- మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను 'అర్నబ్' ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో కనిపిస్తోంది. ఈ తీవ్ర తుపాను కారణంగా కొన్ని తీర ప్రాంతాల్లో జోరుగా వానలు పడటంతో పాటు, బలమైన గాలులు కూడా వీస్తున్నట్లు వార్తాసంస్థ ఏఎన్‌ఐ పేర్కొంది.

అక్టోబర్ 27 నాటికి ఇది అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత ఇది వాయువ్య దిశగా కదిలి, అక్టోబర్ 28 ఉదయానికల్లా బాపట్ల – విశాఖపట్నం మధ్య ఉన్న యానాం వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో గంటకు 115 నుంచి 125 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, గరిష్టంగా 140 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుపానుకు అర్నబ్ అనే పేరును బంగ్లాదేశ్ ప్రతిపాదించింది. వరల్డ్ మెటియరలాజికల్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూఎంవో), ఐక్యరాజ్యసమితికి చెందిన ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్ (ఈఎస్‌సీఏపీ)కి చెందిన నిపుణుల కమిటీ ఆమోదించిన అధికారిక ట్రాపికల్ సైక్లోన్స్ పేర్ల జాబితాలో ఈ అర్నబ్ పేరు ఉంది.

Parliamentary systems : చట్ట సభల్లో మార్పు రావాలి

 Severe Cyclone ‘Arnab’

Severe Cyclone ‘Arnab’ : తుపాన్లకు పేర్లు ఎలా పెడతారు?

ప్రపంచవ్యాప్తంగా మొత్తం 5 ప్రాంతీయ తుపాను కేంద్రాలు, 6 రీజినల్ స్పెషలైజ్డ్ మెటియరలాజికల్ సెంటర్లు (RSMCs) పనిచేస్తున్నాయి. ఉత్తర హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా సముద్ర ప్రాంతాల్లో ఏర్పడే తుపాన్లకు పేర్లు పెట్టడానికి WMO/ESCAP ప్యానెల్‌లోని 13 సభ్య దేశాలు పాల్గొంటాయి. భారత్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మియన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, ఇరాన్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈ, యెమెన్ ఈ ప్యానెల్‌లోని సభ్యదేశాలు. ఈ 13 దేశాలు తలా 13 పేర్ల చొప్పున మొత్తం 169 పేర్లతో కూడిన సుదీర్ఘ జాబితాను రూపొందించాయి. ఆయాదేశాల ఇంగ్లిష్ అక్షర క్రమం (ఆల్ఫాబెటికల్ ఆర్డర్) ప్రకారం ప్రతీ తుపానుకు వరుసగా పేర్లు కేటాయిస్తారు.

అర్నబ్ తర్వాత వచ్చే 10 తుపాన్లు ఇవే..

క్రమ సంఖ్యతుపాను పేరుప్రతిపాదించిన దేశం
1మురసుభారత్
2అక్వాన్ఇరాన్
3కానిమాల్దీవులు
4ఎంగామాన్మియన్మార్
5సైల్ఒమన్
6సహాబ్పాకిస్తాన్
7లులుఖతర్
8రజీర్సౌదీ అరేబియా
9గిగుమ్శ్రీలంక
10థిన్యొట్థాయిలాండ్

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

ఈ నెల 30న ఖాతాల్లోకి PM కిసాన్ నిధులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha