Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అర్థరాత్రి యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం.. కాపాడిన శక్తి యాప్!

అర్థరాత్రి యువతిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం.. కాపాడిన శక్తి యాప్!

వార్త 1 month ago

Shakti App Rescue: విజయవాడ బస్టాండ్‌లో అర్థరాత్రి ఒంటరిగా ఉన్న యువతిని చూసి ఫణీంద్ర అనే ఆటో డ్రైవర్ తప్పుగా ప్రవర్తించాడు. ఆమెను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లే నెపంతో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచార ప్రయత్నం చేశాడు.

ఆ సమయంలో యువతి ఎంతో ధైర్యంగా వ్యవహరించి తన ప్రాణాలను కాపాడుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Read also: Moodabidri Footbridge Collapse:దైవ బండార ఊరేగింపులో కూలిన వంతెన.. ఎనిమిది మందికి గాయాలు!

 Police rescue woman using Shakti App

Shakti App Rescue: ఆదుకున్న శక్తి యాప్

యువతి ఆటో ఎక్కగానే అప్రమత్తమై శక్తి యాప్‌లో వివరాలు నమోదు చేసింది. ఆమె ఆపదలో ఉన్నట్లు పోలీసులకు వెంటనే సమాచారం చేరింది. మంగళగిరి రూరల్ పోలీసులు జిపిఎస్ ఆధారంగా యువతి ఎక్కడుందో కనిపెట్టి నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. ఆ కీచక డ్రైవర్ నుంచి యువతిని క్షేమంగా రక్షించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల కీలక సూచనలు

మహిళల భద్రత కోసం ప్రభుత్వం తెచ్చిన శక్తి యాప్ ఎంతో అద్భుతంగా పనిచేస్తుందని మంగళగిరి డీఎస్పీ మురళి కృష్ణ తెలిపారు. ఒంటరిగా ప్రయాణాలు చేసే సమయంలో ప్రతి మహిళ తమ ఫోన్లలో ఈ యాప్ ఉంచుకోవాలని సూచించారు. ఆపద వస్తే కేవలం ఒక్క బటన్ నొక్కితే చాలు పోలీసులు వెంటనే మీ వద్దకు వస్తారని ఆయన భరోసా ఇచ్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

సాగు నీరు లేక పంట ఎండిపోయిందని ఆవేదనతో రైతు ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha