Dailyhunt
అసెంబ్లీ ఎన్నికల వేళ.. సీఎం స్టాలిన్ కారును వదిలిపెట్టని అధికారులు

అసెంబ్లీ ఎన్నికల వేళ.. సీఎం స్టాలిన్ కారును వదిలిపెట్టని అధికారులు

వార్త 2 weeks ago

Tamil Nadu Assembly Elections: తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయాలు హీటెక్కాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూసుకుపోతుండగా, అక్రమ నగదు, బహుమతుల రవాణాపై ఎన్నికల సంఘం నిఘా పెంచింది.

ఈ క్రమంలో మంగళవారం (మార్చి 31) తంజావూరు సమీపంలో ఎన్నికల ప్రచారంలో చెన్నై నుంచి తిరుచిరాపల్లికి విమానంలో చేరుకున్న ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరువారూరుకు బయలుదేరారు. మార్గమధ్యలో తంజావూరు సమీపంలోని సాలియ మంగళం వద్ద ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ముఖ్యమంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. నిబంధనల ప్రకారం సీఎం ప్రయాణిస్తున్న వాహనాన్ని అధికారులు క్షుణ్ణంగా సోదా చేశారు.

Read Also : Uttar Pradesh: చనిపోయిన అంగన్‌వాడీ కార్యకర్తకు షోకాజ్ నోటీసులు.. అధికారుల నిర్లక్ష్యం

 Election officials search CM Stalin’s car!

Tamil Nadu Assembly Elections: సోదాలో మహిళా అధికారుల భాగస్వామ్యం

ఈ తనిఖీల్లో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ముఖ్యమంత్రి కూర్చున్న కారు ముందు భాగాన్ని, వెనుక డోర్లను తెరిచి మరీ పరిశీలించారు. ఈ సోదాల్లో మహిళా పోలీసు అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే, వాహనంలో ఎలాంటి అభ్యంతరకర వస్తువులు లేదా నగదు లభించకపోవడంతో అధికారులు వాహనాన్ని ముందుకు వెళ్లడానికి అనుమతించారు.

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి. మార్చి 30 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రోజే ముఖ్యమంత్రి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, నామ్ తమిళర్ పార్టీ కోఆర్డినేటర్ సీమాన్ వంటి ప్రముఖులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం స్టాలిన్ కొలత్తూరులో భారీ రోడ్ షో నిర్వహించి తన ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

తిరువారూరు సభలో స్టాలిన్ సందడి

ముఖ్యమంత్రి స్టాలిన్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు తన సొంత నియోజకవర్గమైన తిరువారూరులో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభ ద్వారా డీఎంకే అభ్యర్థి పూండి కలైవానన్, సీపీఐ అభ్యర్థి మారిముత్తు, ఎస్టీపీఐ అభ్యర్థి మహమ్మద్ ముబారక్, మన్నార్గుడి అభ్యర్థి టి.ఆర్.పి. రాజా తరపున ఆయన ప్రచారం నిర్వహించనున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

మార్చి 31 లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha