Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత: కేటీఆర్, హరీశ్‌రావుల అరెస్ట్!

అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత: కేటీఆర్, హరీశ్‌రావుల అరెస్ట్!

వార్త 3 weeks ago

KTR Harish Rao Arrested: తెలంగాణ శాసనసభ (అసెంబ్లీ) ప్రాంగణం వద్ద భారీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల రంగు టీ షర్టులు ధరించి, నిరసన తెలపడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని గన్ పార్క్ సమీపంలోనే అడ్డుకున్నారు.

దీంతో పోలీసులకు, ప్రజాప్రతినిధులకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో భాగంగా నల్ల దుస్తులతో సభలోకి వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు (కేటీఆర్), మాజీ మంత్రి హరీశ్ రావులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also :Hyderabad Metro Common Pass: హైదరాబాద్ ప్రయాణికులకు శుభవార్త.. మెట్రో, ఆర్టీసీకి ఒకే పాస్

KTR Harish Rao Arrested: అసెంబ్లీ ముట్టడి యత్నం.. పోలీసుల ముందస్తు చర్యలు

తెలంగాణ అమరవీరుల స్థూపం (గన్ పార్క్) వద్ద నివాళులర్పించిన అనంతరం బీఆర్ఎస్ నాయకులు నల్ల టీ షర్టులతో అసెంబ్లీకి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి నిరోధించారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో పోలీసులు కేటీఆర్, హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జగదీష్ రెడ్డి తదితర ముఖ్య నాయకులను రక్షణ వాహనాల్లోకి తరలించి సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. అసెంబ్లీ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వేలాది మంది పోలీసులతో బారీ భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షల వల్ల అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాలకు ఈసారి కూడా KCR దూరం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha