Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అసెంబ్లీకి రాని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి

అసెంబ్లీకి రాని కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి

వార్త 2 weeks ago

Chinnakodur Congress Bike Rally: శాసనసభ సమావేశాలకు హాజరుకాని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ మీసం మహేందర్ డిమాండ్ చేశారు.

శుక్రవారం ఆయన ఆధ్వర్యంలో అల్లిపూర్ శివారులోని అనంతగిరి రిజర్వాయర్ కట్ట మైసమ్మ దేవాలయం నుంచి కాంగ్రెస్ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ అల్లిపూర్, కమ్మర్లపల్లి, మైలారం, సలింద్రి గ్రామాల మీదుగా చిన్నకోడూరు మండల కేంద్రానికి చేరుకుంది. గత బీఆర్ఎస్ పదేండ్ల పాలనలోని అవినీతి, మోసాలను ఎండగడుతూ ప్లేకార్డులతో నిరసన తెలిపారు. అనంతరం స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

జీతాలు తీసుకుంటూ ఫామ్‌హౌస్‌కే పరిమితం - రేవంత్ అన్న ధాటికి భయపడుతున్నారు

ఈ సందర్భంగా మీసం మహేందర్ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి ముఖం చాటేసి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. సభకు హాజరుకాకుండానే ఇప్పటివరకు రూ. 1.24 కోట్ల ప్రజాధనాన్ని జీతభత్యాల రూపంలో తీసుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకోలేరని మాట్లాడుతున్న కేటీఆర్.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వాదనల ధాటికి తట్టుకోలేకే తమ తండ్రిని సభకు రానివ్వకుండా దాస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాధనంతో కేసీఆర్ భద్రత, బాగోగులు చూసుకుంటున్నారు తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.

Chinnakodur Congress Bike Rally: సొంత భూముల కోసమే హరీష్ రావు ఆరాటం - 22A పై ప్రజలు భయపడొద్దు

ఎమ్మెల్యే హరీష్ రావు ఎక్కడికి వెళ్లినా 22A భూముల అంశాన్ని ప్రస్తావించడం వెనుక ఆంతర్యం తమ అక్రమ ఆస్తులను కాపాడుకోవడమేనని మహేందర్ ఆరోపించారు. గతంలో పేదలను మోసం చేసి రాయించుకున్న భూములకు సరైన ఆధారాలు లేకపోవడంతోనే ఎక్కడ చేజారిపోతాయోనన్న భయంతో రైతులను, యువతను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. అర్హులైన రైతులు, పేదలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఆధారాలతో జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులను కలిస్తే ప్రజా ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. సిద్దిపేటలో నియంతృత్వ పాలనకు కాలం చెల్లిందని, త్వరలోనే ప్రజలకు మంచి రోజులు వస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

రైతు వ్యతిరేక విధానాలపై భువనగిరిలో బీఆర్‌ఎస్ గర్జన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha