Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రైతు వ్యతిరేక విధానాలపై భువనగిరిలో బీఆర్‌ఎస్ గర్జన

రైతు వ్యతిరేక విధానాలపై భువనగిరిలో బీఆర్‌ఎస్ గర్జన

వార్త 2 weeks ago

Bhongir BRS Protest: కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల వైఫల్యాలను నిరసిస్తూ యాదాద్రి భువనగిరి మండల పరిధిలోని హన్మపురం రైతువేదిక వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.

రైతుబంధు ఎగ్గొట్టారు - 420 హామీలను విస్మరించారు: జనగాం పాండు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నాయకుడు జనగాం పాండు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని 420 హామీలను గుప్పించిందని, అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ పదేళ్ల సువర్ణ పాలనలో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు రైతులను అడుగడుగునా ఇబ్బందుల పాలు చేస్తోందని విమర్శించారు. రైతుబంధు కింద ఐదు విడతల నిధులు జమ చేయాల్సి ఉండగా.. కేవలం రెండు విడతలు మాత్రమే నామమాత్రంగా విదిల్చి, మిగిలిన మూడు విడతలను పూర్తిగా ఎగ్గొట్టారని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే మేల్కొని రైతులకు ఇచ్చిన హామీలను, ఆరు గ్యారంటీలను యుద్ధప్రాతిపదికన అమలు చేయాలని డిమాండ్ చేశారు.

Bhongir BRS Protest: రైతుల పక్షాన రాజీలేని పోరాటం - హాజరైన ప్రజాప్రతినిధులు

రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని, రైతులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటం ఆగదని నేతలు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ జక్కా రాఘవేంద్ర, మాజీ ఎంపీపీ కేశపట్నం రమేష్, జిల్లా నాయకులు ర్యాకల శ్రీనివాస్‌తో పాటు హన్మపురం, మనెవరిపంపు, తాజ్‌పూర్, అనంతారం గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అన్నదాతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha