Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'అథిరడి' (సోనీ లివ్)సినిమా రివ్యూ

'అథిరడి' (సోనీ లివ్)సినిమా రివ్యూ

వార్త 2 weeks ago

Athiradi Movie Review: బాసిల్ జోసెఫ్, టోవినో థామస్ ప్రధాన పాత్రల్లో అరుణ్ అనిరుద్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన మలయాళ చిత్రం 'అథిరడి'. మే 14న థియేటర్లలో విడుదలై, రూ.

30 కోట్ల బడ్జెట్‌తో ఏకంగా రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ యాక్షన్ కామెడీ డ్రామా.. ఈ నెల 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘సోనీ లివ్’ (Sony LIV) లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథ, కథనాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

అన్నయ్యపై పడ్డ నిందను చెరపడమే కథాంశం

సామ్ కుట్టి (బాసిల్ జోసెఫ్) అనే యువకుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరి ప్రశాంత్‌తో కలిసి ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుంటాడు. గతంలో అదే కాలేజీలో చదివిన సామ్ అన్నయ్య జోసెఫ్ (సుకుమార్) ‘ఆరోహణ్’ పేరుతో కాలేజీ ఫెస్ట్ నిర్వహిస్తాడు. అయితే ఒకసారి ఆ ఫెస్ట్‌లో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ నింద జోసెఫ్ పై పడుతుంది. దాంతో కాలేజీ యాజమాన్యం ఆ ఫెస్ట్‌ను శాశ్వతంగా నిషేధిస్తుంది.

read also: Nagabandham Movie Trailer: ఆసక్తికరమైన థియేట్రికల్ 'నాగబంధం' ట్రైలర్ విడుదల

తన అన్నయ్యపై పడిన ఆ చేదు ముద్రను తుడిచేసి, కాలేజీలో మళ్లీ ఆ ఫెస్ట్‌ను ఘనంగా నిర్వహించి, అప్పటి పాత బ్యాచ్‌ను ఆహ్వానించాలని సామ్ కుట్టి గట్టిగా నిర్ణయించుకుంటాడు. ఈ ప్రయత్నంలో అతనికి స్వాతి ఆర్ కృష్ణ (రియా శిబూ) మద్దతుగా నిలుస్తుంది.

Athiradi Movie Review: ఊహించని మలుపు తిప్పిన ‘కుట్టన్’ ఎంట్రీ

ఫెస్ట్‌లో లైవ్ పెర్ఫార్మెన్స్ కోసం ప్రముఖ సింగర్ వినీత్ శ్రీనివాసన్‌ను సామ్ ఒప్పిస్తాడు. కానీ అదే సమయంలో స్ట్రీట్ సింగర్ అయిన కుట్టన్ (టోవినో థామస్)తో సామ్ గ్యాంగ్‌కు గొడవ జరుగుతుంది. ఈ గొడవలో కుట్టన్ భార్యకు గాయాలవుతాయి. ఆ తర్వాతే కుట్టన్ ఒక పెద్ద గూండా అని, అతనిపై ఎన్నో కేసులున్నాయని సామ్‌కు తెలుస్తుంది. కక్ష సాధింపులో భాగంగా కుట్టన్ గ్యాంగ్ సింగర్ వినీత్ శ్రీనివాసన్‌ను కిడ్నాప్ చేస్తుంది. ఆ తర్వాత సామ్ తన మిత్రబృందంతో కలిసి వినీత్‌ను ఎలా కాపాడుకున్నాడు? కాలేజీ ఫెస్ట్ నిర్వహించాలనే అతని కల నెరవేరిందా? అన్నదే మిగతా సినిమా.

ఫస్టాఫ్ సరదాగా.. సెకండాఫ్ కిడ్నాప్ డ్రామాతో..

సినిమా మొదటి భాగం హీరో కాలేజ్ లైఫ్, అతని యాటిట్యూడ్, ఫ్రెండ్‌షిప్, లవ్, కాలేజీ అల్లర్లతో చాలా సరదాగా సాగిపోతుంది. ఇక సెకండాఫ్‌లో టోవినో థామస్ ఎంట్రీతో కథ సీరియస్‌గా మారుతుంది. హీరో ప్రయత్నాలకు విలన్ అడ్డుపడటం, ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే కిడ్నాప్ డ్రామాతో కథలో వేగం పెరుగుతుంది.

దర్శకుడు కాలేజీ నేపథ్యంలో లవ్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ కలిపి యూత్‌ను టార్గెట్ చేస్తూ సినిమాను రూపొందించాడు. అయితే సాధారణ క్యాంపస్ సినిమాల్లో ఉండే బలమైన ప్రేమ, స్నేహ బంధాలకు ఇందులో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకపోవడం కాస్త నిరాశపరుస్తుంది.

ప్లస్ లు.. మైనస్ లు..

బాసిల్ జోసెఫ్ తన మార్క్ బాడీ లాంగ్వేజ్, నటనతో మెప్పించాడు. కామెడీ పాత్రల్లో ఆయన టైమింగ్ ఎప్పుడూ బాగుంటుంది. అయితే ఈ సినిమాలో పాత్ర డిజైన్ బాగున్నా, కథలో తగినంత బలం లేకపోవడం మైనస్ అని చెప్పాలి. టోవినో థామస్ పాత్రకు ఇచ్చిన బిల్డప్ బాగున్నా, ఆ తర్వాత అతని క్యారెక్టర్‌లో ఆశించిన స్థాయిలో పవర్ కనిపించదు. హీరోయిన్ పాత్ర కేవలం నామమాత్రంగానే మిగిలిపోయింది.

సామ్యూల్ హెన్రీ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. విష్ణు విజయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. ఛమన్ చాకో ఎడిటింగ్ ఓ మోస్తరుగా ఉంది. బాసిల్ జోసెఫ్ సినిమా అనగానే ప్రేక్షకులు ఆశించే రేంజ్ కామెడీ ట్రాక్స్ ఇందులో లోపించాయి. అక్కడక్కడా నవ్వించినప్పటికీ, కథాకథనాల్లో పట్టు లేకపోవడం వల్ల సినిమా ఆడియన్స్ అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది.

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ బరోస్ కన్నుమూత

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha