AP Job Notification : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తూ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం వర్చువల్ విధానంలో కీలక సమీక్షా సమావేశం నిర్వహించింది.
ఈ భర్తీ ప్రక్రియను మొత్తం నాలుగు దశల్లో పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే మొదటి ఫేజ్‌లో భాగంగా విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో 1,523 అధ్యాపక (లెక్చరర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. దీనికి కొనసాగింపుగా రెండో దశలో 3,168 పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
nara lokesh focus on educational results apహోం శాఖలో భారీగా ఖాళీలు.. అక్టోబర్ 15 నాటికి తదుపరి దశలు
మిగిలిన పోస్టుల భర్తీకి సంబంధించి మూడో దశలో 2,388 పోస్టులు, నాలుగో దశలో 2,981 పోస్టులతో అక్టోబర్ 15న ఉమ్మడిగా నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రి లోకేష్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా మూడో దశలోని ఉద్యోగాల్లో సింహభాగం, అంటే 2,225 పోస్టులు ఒక్క హోం శాఖకు చెందినవే ఉండటం పోలీసు ఉద్యోగార్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ఈ మొత్తం ఉద్యోగాల ఖాళీల పూర్తి వివరాలను మరియు శాఖల వారీ వర్గీకరణను ఆగస్టు 6న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముందు ఉంచి తుది ఆమోదం తీసుకోనున్నారు. ప్రభుత్వ క్రమబద్ధమైన చర్యలతో త్వరలోనే రాష్ట్రంలో ఉద్యోగాల పండుగ మొదలుకానుంది.
కంగనాపై సీపీఐ నారాయణ ఫైర్.. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్

