Tiger woods arrest : ప్రపంచ ప్రఖ్యాత గోల్ఫ్ దిగ్గజం Tiger Woods మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అతివేగంతో కారు నడిపి ప్రమాదానికి కారణమయ్యారన్న ఆరోపణలతో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
మత్తు పదార్థాల ప్రభావంతో వాహనం నడిపారన్న అనుమానంతో 'డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్' (DUI) కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వుడ్స్‌కు ఎలాంటి గాయాలు కాలేదని పోలీసు అధికారులు వెల్లడించారు.
ప్రమాదం ఎలా జరిగింది?
ఫ్లోరిడాలోని జూపిటర్ ఐలాండ్ ప్రాంతంలో ఉన్న తన నివాసానికి సమీపంలో వుడ్స్ ఈ ప్రమాదానికి కారణమయ్యారని పోలీసులు తెలిపారు. గంటకు 30 మైళ్ల వేగ పరిమితి ఉన్న రోడ్డుపై ఆయన తన ల్యాండ్ రోవర్ కారును అధిక వేగంతో నడిపారని సమాచారం. ముందున్న ట్రక్కును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించే సమయంలో వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో కారు అదుపుతప్పి రోడ్డుపక్కకు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన తర్వాత వుడ్స్ స్వయంగా కారులో నుంచి బయటకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు అక్కడికి చేరుకుని పరీక్షలు నిర్వహించగా ఆయన మత్తులో ఉన్నట్లు అనుమానం వ్యక్తమైంది. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో మద్యం సేవించలేదని తేలినా, ఇతర మత్తు పదార్థాలు తీసుకున్నారో లేదో తెలుసుకోవడానికి చేసే యూరిన్ టెస్టుకు వుడ్స్ నిరాకరించినట్లు అధికారులు చెప్పారు. దీంతో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
Read Also:IPL 2026: RCB vs SRH పోరుకు సర్వం సిద్ధం.. కానీ బెంగళూరుకు బిగ్ షాక్
Tiger woods arrestగతంలో కూడా వివాదాలు
ఇలాంటి ఘటనల్లో వుడ్స్ చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. 2017లో కూడా పెయిన్ కిల్లర్స్ అధిక మోతాదులో తీసుకుని కారులో నిద్రపోతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఆ సమయంలో ఆయనపై నిర్లక్ష్యంగా వాహనం నడిపినట్లు కేసు నమోదు అయ్యింది. అలాగే 2021లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇప్పుడు జరిగిన ఈ ఘటన ప్రతిష్ఠాత్మక గోల్ఫ్ టోర్నీ అయిన The Masters Tournament ప్రారంభానికి కొద్ది రోజుల ముందే చోటుచేసుకోవడం గమనార్హం. ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump స్పందిస్తూ, "అతను నా మంచి స్నేహితుడు. ప్రస్తుతం కొన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాడు" అని వ్యాఖ్యానించారు. 50 ఏళ్ల వుడ్స్ ఇటీవల వెన్నెముక శస్త్రచికిత్స నుంచి కోలుకుని మళ్లీ గోల్ఫ్‌లో రాణించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం అభిమానులను కలవరపెడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

