Dailyhunt
IPL సోషల్ మీడియా వార్: ఫాలోవర్ల లో CSKను దాటేసిన RCB!

IPL సోషల్ మీడియా వార్: ఫాలోవర్ల లో CSKను దాటేసిన RCB!

వార్త 3 weeks ago

IPL 2026 Fan Base: ఐపీఎల్ అంటే కేవలం గ్రౌండ్ లో జరిగే ఆట మాత్రమే కాదు, సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్ కూడా! ప్రతి ఏటా ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఏ జట్టుకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారనే చర్చ నడుస్తూనే ఉంటుంది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల లెక్కల ప్రకారం, ఐపీఎల్ జట్ల మధ్య గట్టి పోటీ నెలకొంది.

Read Also:IPL 2026: RCB vs SRH పోరుకు సర్వం సిద్ధం.. కానీ బెంగళూరుకు బిగ్ షాక్

22 మిలియన్ల మార్కును చేరిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

ఎంఎస్ ధోనీ సారథ్యంలోని (ప్రస్తుతం రుతురాజ్ గైక్వాడ్) చెన్నై సూపర్ కింగ్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ జట్టు అధికారిక పేజీ 22 మిలియన్ల ఫాలోవర్ల మార్కును టచ్ చేసింది. గతంలో సుదీర్ఘ కాలం పాటు నంబర్ 1 స్థానంలో ఉన్న సీఎస్కే, ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయింది. అయినప్పటికీ, అగ్రస్థానంలో ఉన్న జట్టుతో పోలిస్తే వ్యత్యాసం చాలా తక్కువగానే ఉంది.

 Most Followed IPL Team on Instagram

అగ్రస్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

కింగ్ కోహ్లీ క్రేజ్ పుణ్యమా అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సోషల్ మీడియాలో రారాజుగా వెలుగుతోంది. అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న ఐపీఎల్ జట్టుగా ఆర్సీబీ మొదటి స్థానంలో నిలిచింది. కప్పు గెలిచినా గెలవకపోయినా, ‘ఈ సారి కప్పు మనదే’ అనే స్లోగన్‌తో ఆర్సీబీ ఫ్యాన్స్ చేసే హంగామా ఈ జట్టును టాప్‌లో నిలబెట్టింది.

ఈ ఫ్యాన్ బేస్‌లో మూడో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. రోహిత్ శర్మ ఫేవరెట్‌గా ముంబైకి కూడా పోటాపోటీ ఫ్యాన్ బేసే ఉంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కి 19 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల ఫేవరెట్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టకు మాత్రం 5.4 మిలియన్ల ఫాలోవర్సే ఉన్నారు. ఈ ఫ్రాంఛైజీలో టీమిండియాకు చెందిన ఓ స్థిరమైన ఆటగాడు లేకపోవడం తక్కువ ఫ్యాన్ బేస్‌కి కారణమని చెప్పొచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఆరెంజ్ ఆర్మీ బోణీ కొట్టేనా? ఆర్‌సీబీతో సన్‌రైజర్స్ 'ఢీ'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha