Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ATMలో డబ్బులు తీస్తున్నారా? SBI కొత్త రూల్స్ ఇవే

ATMలో డబ్బులు తీస్తున్నారా? SBI కొత్త రూల్స్ ఇవే

వార్త 2 weeks ago

SBI Bank Charges: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు కీలక అప్డేట్. ATM లావాదేవీలకు సంబంధించిన ఉచిత పరిమితులు, అదనపు ఛార్జీల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చినట్లు సమాచారం.

ముఖ్యంగా బేసిక్ సేవింగ్స్ అకౌంట్, శాలరీ అకౌంట్ వినియోగదారులపై ఈ మార్పుల ప్రభావం ఉండనుంది. ఉచిత లావాదేవీల పరిమితిని దాటితే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అకౌంట్ రకాన్ని బట్టి SBI ఉచిత ATM లావాదేవీల పరిమితులను నిర్ణయిస్తుంది. ఉచిత లిమిట్‌లో ఆర్థిక లావాదేవీలతో పాటు బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్ వంటి కొన్ని ఆర్థికేతర లావాదేవీలు కూడా పరిగణనలోకి వస్తాయి.

Telangana Bars Bandh: తెలంగాణలో నేటి నుంచి 1200 బార్లు బంద్

బేసిక్ సేవింగ్స్ అకౌంట్‌కు 4 ఉచిత లావాదేవీలు

బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్న ఖాతాదారులకు ATM వద్ద నెలకు 4 ఉచిత లావాదేవీలు మాత్రమే అందుబాటులో ఉంటాయని సమాచారం. ఈ పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి లావాదేవీకి రూ.15 + GST ఛార్జీ విధించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో తరచుగా ATMలను ఉపయోగించే ఖాతాదారులు తమ ఉచిత లావాదేవీల సంఖ్యను గమనించి నగదు ఉపసంహరణలు, ఇతర ATM సేవలను ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

శాలరీ అకౌంట్‌పై కొత్త పరిమితులు

SBI శాలరీ అకౌంట్ వినియోగదారులకు ఇతర బ్యాంకుల ATMల వద్ద ఉచిత లావాదేవీల పరిమితిని కూడా తగ్గించినట్లు సమాచారం. గతంలో నెలకు 10 ఉచిత లావాదేవీలు ఉండగా.. ఇప్పుడు 5 లావాదేవీలకు పరిమితం చేసినట్లు పేర్కొన్నారు. ATMలతో పాటు ఆటోమేటెడ్ డిపాజిట్ అండ్ విత్‌డ్రాయల్ మెషీన్ల వద్ద కూడా సంబంధిత నిబంధనలు వర్తించనున్నాయి.

SBI Bank Charges: ఉచిత లిమిట్ దాటితే ఎంత ఛార్జీ?

ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత చేసే ఆర్థిక లావాదేవీలకు రూ.23 + GST వరకు ఛార్జీ విధించనున్నట్లు సమాచారం. అదే సమయంలో బ్యాలెన్స్ చెకింగ్, మినీ స్టేట్‌మెంట్ వంటి ఆర్థికేతర లావాదేవీలకు రూ.11 + GST చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అందువల్ల ATMలో నగదు తీసుకోవడంతో పాటు బ్యాలెన్స్ చెక్, మినీ స్టేట్‌మెంట్ వంటి సేవలను కూడా ఉచిత లావాదేవీల పరిమితిలో భాగంగా పరిగణించే నిబంధనలను ఖాతాదారులు గమనించాలి. మరోవైపు SBI పలు క్రెడిట్ కార్డులకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ సౌకర్యాల్లో కూడా మార్పులు చేసినట్లు సమాచారం. కొన్ని కార్డులకు అందుబాటులో ఉన్న ఉచిత లాంజ్ వినియోగ పరిమితిని తగ్గించినట్లు పేర్కొన్నారు. ఇతర బ్యాంకులు కూడా లాంజ్ యాక్సెస్ పరిమితులను సవరించిన నేపథ్యంలో SBIలోనూ మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది.

Epaper: epaper.vaartha.com

జీఎస్టీ చట్టంలో భారీ సంస్కరణ.. అధికారులకు 'అరెస్ట్‌ పవర్‌' కట్‌!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha