GST reforms: వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా నెక్స్ట్-జనరేషన్ జీఎస్టీ (GST) సంస్కరణలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అక్టోబర్ 7న జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను నిబంధనలను సడలిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
స్వతంత్ర అరెస్ట్ అధికారాలు రద్దు
సీజీఎస్‌టీ చట్టంలోని సెక్షన్ 69 ప్రకారం జీఎస్టీ అధికారులకు ప్రస్తుతం ఉన్న స్వతంత్ర అరెస్ట్ అధికారాలను రద్దు చేసి, ముందస్తుగా న్యాయస్థానం అనుమతి పొందిన తర్వాతే అరెస్ట్ చేసే విధానాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇకపై అరెస్టులు, బెదిరింపు చర్యల కంటే బకాయి పన్నుల వసూలు, వడ్డీ, ఆర్థిక జరిమానాలు వసూలు చేయడానికే ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

క్రిమినల్ కేసుల పరిమితి రూ. 5 కోట్లకు పెంపు
క్రిమినల్ ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు ఉన్న కనీస పన్ను ఎగవేత పరిమితిని రూ. 1 కోటి నుండి రూ. 5 కోట్లకు పెంచనున్నారు. దీనివల్ల రూ. 5 కోట్ల కంటే తక్కువ విలువ కలిగిన వివాదాలను సివిల్ పరి పరిధిలోనే జరిమానాల ద్వారా పరిష్కరిస్తారు.
సాధారణ వ్యాపార వివాదాలకు మినహాయింపు
వస్తువుల వర్గీకరణ , విలువ కట్టడం లేదా ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ అర్హతలపై వ్యాపారులు, పన్ను అధికారుల మధ్య వచ్చే సాధారణ అభిప్రాయ భేదాలను క్రిమినల్ నేరాల జాబితా నుంచి మినహాయిస్తారు.
ప్రాసిక్యూషన్ నిబంధనల సరళీకరణ
చట్టంలో ఉన్న 24 ప్రాసిక్యూషన్ నేరాల్లో 9 నేరాలను పూర్తిగా ఎత్తివేయనున్నారు. కనీస జైలు శిక్ష నిబంధనను తొలగించి, కేవలం జరిమానాలతో సరిపెట్టే వెసులుబాటును కోర్టులకు కల్పిస్తారు. మధ్యస్థాయి నేరాలకు గరిష్ట శిక్షా కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించనున్నారు.
డిజిటల్ డేటా ఆధారిత నిఘా
ఇన్వాయిస్ ఆధారిత డేటా మ్యాచింగ్ సాంకేతికత అభివృద్ధి చెందడంతో, నకిలీ క్లెయిమ్‌లను ప్రారంభంలోనే గుర్తిస్తున్నారు. దీనితో భౌతిక అరెస్టుల కంటే డిజిటల్ డేటా ద్వారానే పన్ను ఎగవేతలను అరికట్టనున్నారు.
బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే ఆఫర్.. రూ.1కే సిమ్, 24 రోజులు ఫ్రీ కాల్స్, డేటా

