కేరళలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ క్రమంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ జాతీయ నాయకుడు అయినప్పటికీ, లోకల్ లీడర్‌కు ఉన్నంత అవగాహన కూడాలేదని విమర్శలు గుప్పించారు. గత అనుభవాల నుంచి నేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా లేరని ఎద్దేవా చేశారు. అంతేకాదు, రాహుల్ ఆయన పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కోతమంగళంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
Cm Pinarayi Vijayan
“వాస్తవం ఏమిటంటే, రాహుల్ గాంధీ ఓ జాతీయ నాయకుడు. అయినప్పటికీ ప్రాంతీయ నాయకుడికి ఉన్నంత అవగాహన కూడా ఆయనకు లేదు. అంతేకాదు, ఆయన ఏ విషయాన్ని ఆయన లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఇలాంటి లక్షణాలు రాజకీయ నాయకుడికి తగవు. కాంగ్రెస్ వంటి పెద్ద పార్టీకి చెందిన ముఖ్య నాయకుడిలో ఇలాంటి దిగజారుడు కనిపించడం ఆశ్చర్యకరం.” అని పినరయి విజయన్ అన్నారు.
ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేస్తూ కేంద్ర సంస్థలు ఒత్తిడి తెస్తున్నాయని ఆరోపించారు. అయితే, కేరళలో ఉన్న అవినీతి కేసుల్లో పినరయి విజయన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఎల్‌డీఎఫ్, బీజేపీ మధ్య కుమ్మక్కు ఉన్నదనే అనుమానాలకు దారితీస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు పినరయి విజయన్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

