Dailyhunt
యువత భవిష్యతుకు హుక్కా పొగల ముప్పు

యువత భవిష్యతుకు హుక్కా పొగల ముప్పు

వార్త 3 weeks ago

The threat of hookah : హైదరాబాద్ నగరంలో ఇటీవల హుక్కా సెంటర్లపై పోలీసులు వరుసగా నిర్వహిస్తున్న దాడులు ఒక ముఖ్యమైన సామాజిక సమస్యను మళ్లీ ముందుకు తీసు కొచ్చాయి.

కేఫ్ల పేరుతో, వినోద కేంద్రాల పేరుతో యువతను ఆకర్షిస్తూ నడుస్తున్న ఈ అక్రమ హుక్కా కేంద్రాలు కేవలం చట్ట విరుద్ధ కార్యకలాపాలకే పరిమితం కాకుండా, యువత ఆరోగ్యం, కుటుంబ వ్యవస్థ, నగర సంస్కృతిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గతవారం రోజు లుగా హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్, నాగోల్ ప్రాం తాల్లో జరిగిన వరుస దాడులు ఈ సమస్య ఎంత విస్తృ తంగా ఉందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా కేప్ సంస్కృతి పేరుతోయువతను ఆకర్షిస్తూ హుక్కా విని యోగాన్ని సాధారణంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. హుక్కా (hookah)అంటే కేవలం ఒక వినోద సాధనం అన్న భావ నను వ్యాపింపజేస్తూ, ఆరోగ్యపరమైన ప్రమాదాలను దాచి పెడుతున్నారు. అయితే వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకా రం హుక్కా పొగ తాగడం సాధారణ సిగరెట్ కంటే మరింత ప్రమాదకరమని ఇప్పటికే అనేక పరిశోధనలు వెల్లడించాయి. ఒక గంట పాటు హుక్కా తాగడంఅంటే దాదాపు వంద సిగరెట్లు తాగినంత ప్రమాదం ఉందని కూడా చెబుతున్నారు. అయినప్పటికీ యువతలో దీనిపై సరైన అవగాహన లేకపోవడం ఆందోళన కలిగించే విష యం.

Read Also : LPG fee in restaurants: మీ హోటల్ బిల్లుపై LPG ఫీజు వేస్తున్నారా..?


Hookah smoking is more dangerous than regular cigarettes

వంద సిగరెట్లు తాగినంత ప్రమాదం

ఇటీవల పోలీసులు నిర్వహించిన దాడుల్లో డజన్ల కొద్ది హుక్కా పాట్స్, ప్లేవర్డ్ టొబాకో, వాహనాలు, మొబైల్స్ స్వాధీనం చేసుకోవడం ఈ అక్రమ వ్యాపారం ఎంత పెద్ద స్థాయిలో నడుస్తోందో సూచిస్తోంది. ముఖ్యం గా విద్యార్థులు, యువ ఉద్యోగులు ఈ కేంద్రాలకు ఎక్కు వగా ఆకర్షితులు కావడం సమాజానికి ఒక హెచ్చరికగా భావించాలి. ఒకవైపు చదువు, ఉద్యోగ భవిష్యత్తు ముందుకు సాగాల్సిన వయస్సులో ఇలాంటి అలవాట్లు వారి జీవితాన్ని దారి తప్పించే ప్రమాదం ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే చట్టాలను ఉల్లంఘిస్తూ ఇలాంటి కేంద్రాలు నగరంలో ఎలా కొనసాగుతున్నా యన్న ప్రశ్న. హుక్కా (hookah) సెంటర్లు నడపడానికి అనుమతులు లేకపోయినా, కొన్ని కేఫ్లు పేరుకు మాత్రమే కాఫీ షాపు లుగా నమోదు చేసుకుని లోపల అక్రమంగా హుక్కా సేవ లను అందించడం గమనించదగ్గ విషయం. ఇది కేవలం యజమానుల బాధ్యత మాత్రమే కాదు, స్థానిక పర్యవేక్షణ వ్యవస్థల లోపాన్ని కూడా సూచిస్తుంది. ఒకసారి దాడి చేసి మూసివేయడం మాత్రమే సరిపోదు. దీర్ఘకాలిక పర్య వేక్షణ అవసరం. అలాగే ఈ సమస్యను కేవలం పోలీస్ చర్యలతో మాత్రమే నియంత్రించడం సాధ్యంకాదు. కుటుం బాలు, విద్యాసంస్థలు, సమాజ సంస్థలు కలిసి పనిచేయా ల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై మరింత శ్రద్ధ చూపాలి. వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరితో కలుస్తున్నారు? అనే విషయాల్లో కనీస అవగాహన ఉండాలి. అదే సమయంలో విద్యాసంస్థ లు కూడా విద్యార్థులకు ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇంకా ఒక ముఖ్యమైన అంశం.

 It is becoming more of a status symbol.

ప్రమాదకర మార్పుకు సంకేతం

సోషల్ మీడియా ప్రభావం. సినిమాలు, వెబ్ సిరీస్లు, సోషల్ మీడియా రీల్స్ హుక్కా వినియోగాన్ని ఒక ఫ్యాషన్గా చూపించడం యువతను ప్రభావితం చేస్తోంది. ఇది ఒక స్టేటస్ సింబల్ అన్న భావన పెంచుతోంది. ఈ భావనను మార్చడానికి ప్రభుత్వ సంస్థలు అవగాహన ప్రచార కార్యక్ర మాలు చేపట్టాలి. ఆరోగ్యపరమైన ప్రమాదాలను స్పష్టంగా ప్రజలకు తెలియజేయాలి. ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాల్సి న అవసరంఉంది. అక్రమహుక్కా కేంద్రాలపై కేవలం అప్పుడప్పుడు దాడులు చేయడం కాకుండా, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలి. అనుమతి లేకుండా హుక్కా సేవలు అందిస్తున్న కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఫ్లేవర్డ్ టొబాకో విక్రయాలపై నియంత్రణను మరింత కట్టు దిట్టం చేయాలి. ఇటీవల జరిగిన దాడుల్లో 80 మందికి పైగా అరెస్టులు జరగడం ఒక సానుకూల సంకేతమే అయినప్పటికీ, ఇది సమస్య పరిమాణాన్ని కూడా తెలియజేస్తోం ది. ఒక్క ప్రాంతంలోనే ఇంత పెద్ద సంఖ్యలో యువత హుక్కా కేంద్రాల్లో పట్టుబడటం సమాజం ఆలోచించాల్సిన అంశం. ఇది కేవలం ఒక చట్టపరమైన సమస్య కాదు. ఒక సామాజిక హెచ్చరిక. మొత్తానికి, హుక్కా సంస్కృతి పెరుగుదల నగర జీవనశైలిలో ఒక ప్రమాదకర మార్పుకు సంకేతం. ఈ పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు, ప్రభుత్వం,తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, మీడియా కలిసి పనిచేయాలి. యువత ఆరోగ్యాన్ని కాపాడటం అంటే భవిష్యత్ సమాజాన్ని కాపాడటమే. కాబట్టి హుక్కా కేంద్రాలపై కఠిన చర్యలతో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు కూడా సమాంతరంగా కొనసాగితేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

-ముద్దం నరసింహస్వామి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

ఇండియాలో ఐఫోన్ 18 ప్రో ధర ఎంతంటే.?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha