Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అవనిగడ్డలో ప్రభుత్వ బడిని సందర్శించిన లోకేశ్.. అధికారులకు సూచనలు

అవనిగడ్డలో ప్రభుత్వ బడిని సందర్శించిన లోకేశ్.. అధికారులకు సూచనలు

వార్త 1 week ago

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, వారితో సరదాగా ముచ్చటించారు.

విద్యార్థులంతా బాగా చదివి మంచి ఫలితాలు సాధించాలి.. ఒకవేళ మీరు బాగా చదవకపోతే ముఖ్యమంత్రి నాకు మార్కులు తగ్గిస్తారు. మీరు అద్భుతంగా చదివితేనే మంత్రిగా నాకు మంచి మార్కులు వస్తాయి అని లోకేష్ వ్యాఖ్యానించడంతో విద్యార్థులు ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు.

Read Also : Kalyandurgam News:పెన్షనర్ల సమస్యలపై ఖజానాధికారి కీలక నిర్ణయం!

 Lokesh visited a government school in Avanigadda.

Nara Lokesh: రూ.1.4 కోట్లతో నూతన హైస్కూల్ భవనాల ప్రారంభం

అవనిగడ్డలోని మోపిదేవి మండలం కొక్కిలిగడ్డలో పి4 (P4) పథకంలో భాగంగా దాతల సహకారంతో రూ.1.4 కోట్ల భారీ వ్యయంతో నూతనంగా నిర్మించిన జడ్పీ హైస్కూలు (ZPHS) నూతన భవనాలను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 9, 10 తరగతుల విద్యార్థులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, కష్టపడి చదివి స్కూల్ పాస్ పర్సంటేజిని పెంచాలని సూచించారు. త్వరలోనే విద్యార్థులందరికీ ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా కిట్స్’ మరియు బూట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.

ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు

సమాజంలో నిజమైన మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తాను స్వయంగా విద్యాశాఖను కోరుకుని ఎంచుకున్నానని, దీనిని ఒక ఛాలెంజ్‌గా తీసుకున్నానని లోకేష్ స్పష్టం చేశారు. గత రెండేళ్లలో విద్యావ్యవస్థలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని, రాష్ట్రవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయని చెప్పారు. ఉపాధ్యాయులు ఇకపై పూర్తి శ్రద్ధ ఫలితాలపైనే పెట్టాలని, నూరు శాతం ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సాధిస్తున్న విజయాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని, ఈ ఏడాది ప్రతిభ కనబర్చిన విద్యార్థుల ఫొటోలతో పత్రికల్లో యాడ్స్ ఇచ్చామని, ఈ విధానాన్ని మున్ముందు కూడా కొనసాగిస్తామని తెలిపారు. విద్యార్థులకు విద్యా కిట్లు, బూట్లు అందజేస్తామని తెలిపారు. ఇక వచ్చేనెల 16,17,18 తేదీల్లో పేరెంట్-టీచర్ మీటింగ్లు నిర్వహిస్తామని తెలిపారు. ఉపాధ్యాయుల ప్రధాన లక్ష్యం ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత సాధించడం అని ఆదేశించారు

జొన్నగిరి ఇక 'స్వర్ణగిరి'

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha